రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారు: సచివాలయం అక్కడే ఉండాలి: బీజేపీ విష్ణు..!

రాష్ట్రంలో ఎం జరుగుంతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్ రెడ్డి కమిటీ అంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కమిటీ నివేదికలు ఉన్నాయని విమర్శించారు. టీడీపీని గందరగోళంలో నెట్టడానికి జగన్ ప్రకటన ఉంది తప్ప ప్రజల కు ఉపయోగపడేలా లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలా లేక అధికార వికేంద్రీకరణ జరగాలా అనే సందిగ్ధంలో ఉన్నారని ఎద్దేవా చేసారు. హై కోర్టును కర్నూల్ లో పెట్టమంటే నాడు చంద్రబాబు వినలేదు గుర్తు చేసారు. సీఎం జగన్..చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను తమ జాగీర్ అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.

ఫుట్ బాల్ లా అడ్డుకుంటున్నారు..

ఫుట్ బాల్ లా అడ్డుకుంటున్నారు..

రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లా అడ్డుకుంటున్నారు విష్ణు వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని భాజపా నాడే చెప్పిందని.. దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు. హై కోర్ట్ రావడం వలన కొత్తగా కర్నూల్ కి మహా అయితే నాలుగు జిరాక్స్ మిషన్లు నాలుగు న్యాయవాదుల భవనాలు తప్ప అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడని చెప్పుకొచ్చారు. మిగి లిన రాష్ట్రాన్ని ముంచేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. నాలుగు వేల ఎకరాలు భు కుంభకోణం జరిగింది అని వైసీపీ ప్రభుత్వం చెబుతోందని..కుంభకోణం జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారని ప్రశ్నించారు. రైతులు ఇష్టమో.. కష్టమో తమ పొలాలు త్యాగం చేసి రాజధానికి ఇచ్చారని గుర్తు చేసారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధిక ఎమ్మెల్యేలు మీరే గెలిచారు..మీకు పట్టం కడితే అమరావతి రైతులను మోసం చేస్తారా అని విష్ణు నిలదీసారు.

ఏది వికేంద్రీకరిస్తున్నారు..

ఏది వికేంద్రీకరిస్తున్నారు..

రాయలసీమలో పంటలు పండక ఏడుస్తుంటే..అమరావతి రైతులను మరోలా ఎడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అభివృద్ధి వికేంద్రీకరిస్తారా.. లేక పరిపాలన వికేంద్రీకరిస్తారా అని ప్రశ్నించారు. రాజ కీయంగా తెదేపాను ఇబ్బంది పెట్టడానికే పరిపాలన వికేంద్రీకరణ అనే వైకాపా ఎత్తుగడల కనిపిస్తుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రాన ప్రాంతాలు అభివృద్ధి చెందవని అభిప్రాయపడ్డారు.
హై కోర్ట్ ఒకప్రాంతంలో.. బెంచ్ ఒక ప్రాంతంలో ఉండాలని ఎవరైనా చెప్తారని దానికి జియన్ రావు కమిటీ అవసరంలేదన్నారు. ఏ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని జియన్ రావు కమిటీ పరిగణలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. జియన్ రావు కమిటీ చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో ఉంటే.. మంత్రులు అమరావతిలో ఉండటం ఏంటి.. వారిని విమానాల్లో తరలిస్తారా అని ప్రశ్నించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి అంతే కాని పరిపాలన వికేంద్రీకరణ చేయడం వలన అభివృద్ధి జరగదని సూచించారు.

అక్కడే అసెంబ్లీ..సచివాలయం ఉండాలి..

అక్కడే అసెంబ్లీ..సచివాలయం ఉండాలి..

అమరావతిలో సీడెడ్ కాపిటల్ ఉండాలని.. మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని విష్ణు డిమాండ్ చేసారు. అమరవతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉండాలి అది భాజపా స్పష్టమైన విధాన పరమైన నిర్ణయ మని విష్ణు వర్దన్ రెడ్డి స్పష్టం చేసారు. ఇప్పుడు దీని మీద వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+