చంద్రబాబుకు బీజేపీ మరో షాక్: జగన్‌కు అనుకూలంగా వ్యాఖ్య!

విజయవాడ: ప్రత్యేక హోదా, అరకొర నిధుల విషయం అంటున్న టిడిపి పైన బీజేపీ నేతలు అంతెత్తున లేస్తున్నారు. తాజాగా, తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పైన కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసిపి నుంచి ఇటీవల దాదాపు డజనుకు పైగా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

దీనిపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతల వైఖరి వైసిపి అధినేత జగన్‌కు స్వల్ప ఊరట అని చెప్పవచ్చు. ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ చంద్రబాబుకు ధరల అదుపు పైన లేదన్నారు. టిడిపి విమర్శలకు తమ వద్ద సమాధానం ఉందని చెప్పారు.

BJP leaders fire at Chandrababu for operation akarsh

ఫిరాయింపులతో రాజకీయ అనైతికత సరికాదన్నారు. ఎమ్మెల్యేలను కాకుండా ప్రజలను ఆకర్షించాలని కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులు ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపుల పైన ఇప్పటికే ఇతర పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పార్టీ ఫిరాయింపుల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు కూడా శుక్రవారం నాడు ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసాన్ని ఇప్పటికైనా అందరూ గుర్తించాలన్నారు. ఫిరాయించిన వారు, ఫిరాయించదల్చుకున్న వారు ఆయన మోసాన్ని గుర్తించాలని హితవు పలికారు. హామీల నుంచి మొదలు ప్రత్యేక హోదా వరకు చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+