టీడీపీతోనే పొత్తు: పురంధేశ్వరికి బీజేపీ నేత షాక్! బాబు హ్యాపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖ: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగే అవకాశముందని అంటున్నారు.

చదవండి: రామోజీ రావును కలిసిన జగన్, ముప్పావు గంట చర్చ, ఎందుకు?

Daggubati Purandeswari Will Join In YSRCP Before 2019 Elections - Oneindia Telugu
దక్షిణాదిపై బీజేపీ దృష్టి

దక్షిణాదిపై బీజేపీ దృష్టి

ఈ మేరకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహా రావు మాట్లాడారు. దక్షిణాదిన బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టామన్నారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి కార్యాచరణ రూపొందించామన్నారు.

కేరళ ప్రభుత్వానికి బీజేపీ వణుకు, కర్నాటకలో కాంగ్రెస్ ఓటమి

కేరళ ప్రభుత్వానికి బీజేపీ వణుకు, కర్నాటకలో కాంగ్రెస్ ఓటమి

కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడులకు నిరసనగా జనరక్షణ యాత్ర చేపట్టామని, దీంతో అక్కడి ప్రభుత్వానికి వణుకు పుట్టి, బీజేపీకి వ్యతిరేకంగా యాత్రకు సిద్ధపడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమన్నారు.

టీడీపీతో పొత్తు ఉంటుంది

టీడీపీతో పొత్తు ఉంటుంది

తమిళనాడులో రాజకీయ శూన్యత కనిపిస్తోందని, బీజేపీ అక్కడ కొత్త శక్తిగా ఎదగటానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పారు.

చంద్రబాబుకు, టీడీపీకి ఊరట కలిగించే విషయమే

చంద్రబాబుకు, టీడీపీకి ఊరట కలిగించే విషయమే

కాగా, ఏపీలో టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పడం ద్వారా అనుమానాలకు తెరదించే ప్రయత్నాలు చేశారు. అదే నిజమైతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమతో వస్తుందా లేదా అన్న అనుమానంతో ఉన్న చంద్రబాబు, టిడిపి నేతలకు ఊరట కలిగించే విషయమే అంటున్నారు.

పురంధేశ్వరి వంటి వారికి షాక్

పురంధేశ్వరి వంటి వారికి షాక్

అదే సమయంలో టీడీపీని వదిలి వేరుగా ముందుకు వెళ్తామనుకునే పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ రావు వంటి నేతలకు ఈ వ్యాఖ్యలు షాకింగ్ అంటున్నారు. అయితే ఇప్పుడు అలా చెప్పినప్పటికీ పొత్తుల అంశంపై ఎన్నికల ముందు తేలుతుందనేది మెజార్టీ నేతల వాదన.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leaders GVL Narasimha Rao saidd that alliance with Telugu Desam Party sure in 2019 elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి