రామోజీ రావును కలిసిన జగన్, ముప్పావు గంట చర్చ, ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

YS Jagan tour in districts instead of Padayatra? పాదయాత్రపై జగన్ రివర్స్ గేర్ | Oneindia Telugu
దాదాపు నలభై నిమిషాలు భేటీ

దాదాపు నలభై నిమిషాలు భేటీ

సోమవారం సాయంత్రం దాదాపు ముప్పావు గంట పాటు జగన్ ఆయనతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. రామోజీ రావును జగన్ కలిసిన సమయంలో ఆయన వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారని సమాచారం.

పాదయాత్ర నేపథ్యంలో కలయికకు ప్రాధాన్యం

పాదయాత్ర నేపథ్యంలో కలయికకు ప్రాధాన్యం

సిబిఐ కోర్టు తీర్పు, త్వరలో తలపెట్టనున్న పాదయాత్ర నేపథ్యంలో జగన్.. రామోజీరావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాదయాత్ర నేపథ్యంలో ఆయన ఆశీస్సుల కోసం కలిసి ఉంటారని అంటున్నారు.

గతంలోను భేటీ

గతంలోను భేటీ

కాగా, గతంలోను రామోజీ రావుతో జగన్ భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం జగన్ గుంటూరులో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దీక్షను తలపెట్టారు. దానికి పోలీసులు నిరాకరించారు. ఆ సమయంలో ఆయన రామోజీ రావును కలిశారు.

అప్పుడు చేయి కలిపారు

అప్పుడు చేయి కలిపారు

అంతకుముందు ఓసారి హైదరాబాదులోని హైటెక్స్‌లో మంచు మనోజ్ వివాహం జరిగింది. అప్పుడు ఇరువురు ఎదురుపడ్డారు. జగన్ వెళ్లి రామోజీ రావుకు నమస్కరించారు. రామోజీ రావు లేచి ఆయనతో చేతులు కలిపారు. కాగా, ఇప్పుడు పాదయాత్రకు సహకారం కోసం ఆయన కలిసి ఉంటారా అనే చర్చ సాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that YSR Congress Party chief YS Jaganmohan Reddy on Monday met Eenadu group chief Ramoji Rao.
Please Wait while comments are loading...