నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేకలు, ఈలలు: పవన్‌కు బీజేపీ నేత స్వాగతం(ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ భానుప్రకాశ్ రెడ్డి ఆదివారం నాడు ఘన స్వాగతం పలికారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తలపెట్టిన ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ ఆదివారం ఉదయం హైదరాబాదు నుండి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భానుప్రకాశ్ రెడ్డి ఆయనకు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు.

అనంతరం పవన్ కళ్యాణ్‌తో పాటు నెల్లూరుకు వెళ్లారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే. వారితో పాటు భానుప్రకాశ్ పాల్గొన్నారు.

BJP leaders welcomes Pawan Kalyan

కాగా, స్వర్ణ భారతి ట్రస్ట్‌లో జరిగిన వేడుకల్లో పవన్ మాట్లాడారు. నెల్లూరులో చదువుకున్నానని గుర్తు చేస్తూ ఎదిగే వయస్సులో మంచి ఆలోచనలు ఉన్నప్పుడు యువత కూడా మంచి మార్గంలో నడుస్తుందన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్యతో పాటు నాన్నగారు పాల్గొన్నారన్నారు. స్వచ్ఛ భారత్‌లో అభిమానులు పాల్గొనాలని పవన్‌ పిలుపునిచ్చారు.

మరోవైపు, గతంలో ఎంతో క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమాలు ఈసారి కొంత అరుపులు, కేకలు, ఈలలు కొనసాగాయి. కార్యక్రమానికి వచ్చిన అతిథిలతో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కాలతీతమైందని విద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాలన్ని రద్దుచేశారు. చివరికి ఫొటోలతో సరిపెట్టారు. ట్రస్టీ దీపావెంకట్‌ అనారోగ్యం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.

English summary
BJP leaders Bhanuprakash Reddy welcomes Jana Sena party chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X