Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పహిల్వాన్లలా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు: లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో యుద్ధవాతావరణం సృష్టించారని బిజెపి శాసనసభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌ అన్నారు. విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే వెల్‌లోకి టీఆర్‌ఎస్‌ సభ్యులు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. అధికార సభ్యులకు సహనం అవసరమని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు మార్షల్స్‌ పాత్ర ఎందుకు పోషించాల్సి వచ్చిందో, సభలో ఏం జరిగిందో బయటపెట్టాలన్నారు.

పహిల్వాన్లలా వ్యవహరించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ ప్రసంగం అబద్ధాలు, అసత్యాలతో సాగిందన్నారు. ప్రసంగంలో కేజీటూ పీజీ విద్య ఊసే లేదన్నారు. డబుల్‌ బెడ్‌రూం పథకం ప్రస్తావనే లేదన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రసంగంలో చేర్చకపోవడం బాధాకరమన్నారు. కరువు మండలాలపై కూడా కనీసం మాట్లాడలేదని లక్ష్మణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశం గర్వపడే విధంగా తీర్చుదిద్దుకుందామని, ఆదర్శంగా నిలబెడుదామని పలువురు త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నారని, తెలంగాణ నిర్మాణంలో అన్ని పక్షాలను భాగస్వాములను చేసి భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి టిఆర్ఎస్ అనుచితంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. టిఆర్ఎస్ సభ్యులు ఎందుకు వెల్‌లోకి రావాల్సి వచ్చిందని ఆయన అడిగారు. నిరసత తెలపడానికి వచ్చారా, దాడులు చేయడానికి వచ్చారా అని ఆయన అడిగారు. అధికార పార్టీకి సహనం ఉండాలని, నిరసన వ్యక్తం చేస్తే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. భౌతిక దాడులకు దిగడం కళ్లకు కట్టినట్లు కనిపిచిందని ఆయన అన్నారు.

BJP MLA Laxman deplores TRS attitude in Telangana assembly

తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషించే విధంగా వ్యవహరించారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. వెల్‌లోకి ప్రతిపక్షాల సభ్యులు వెళ్లకుండా అడ్డుకోవడానికి మార్షల్స్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ సభ్యులు మార్షల్స్ పాత్ర పోషించడమేమిటని ఆయన అన్నారు. తెలంగాణకు అది గౌరవం కాదని ఆయన అన్నారు. స్పీకర్ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జాతీయ గీతాన్ని అవమానించిన విషయంపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. శాసనసభకు సంబంధించిన వీడియో దృశ్యాలను బయటపెట్టాలని ఆయన డదిమాండ్ చేశారు.

గవర్నర్ ప్రసంగం అర్థ సత్యాలతో, అబద్ధాలతో తెలంగాణ సమాజం ఆశలను నీరు గార్చే విధంగా ఉందని ఆయన విమర్శించారు. కెజి నుంచి పిజీ ఉచిత విద్య, గృహనిర్మాణ పథకం వంటిని ప్రసంగంలో లేవని ఆయన చెప్పారు. రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారని, కరువు మండలాలను ఇప్పటి వరకు ప్రకటించలేకపోయారని ఆయన ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+