బాబుకు బిజెపి షాక్: 'ఉపాధి పనుల్లో నిధుల దుర్వినియోగం, విచారణ జరిపించాలి'
అమరావతి: ఉపాధి హమీ పధకం నిధులు ఏపీ రాష్ట్రానికి విడుదలైన సంతోషం టిడిపి నేతలకు లేకుండా పోయింది. బిజెపి సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉపాధి హమీ పథకం నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
ఏపీ రాష్ట్రంలో ఉపాధి హమీ పథకం నిధుల దుర్వినియోగం చోటుచేసుకొందని ఇప్పటికే వైసీపీ ఫిర్యాదు చేసింది. అయితే వైసీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఉపాధి హమీ నిధులు రాకుండా నిలిపివేసింది.
అయితే ఏపీ రాష్ట్రంలో ఉపాధి హమీ పనులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నివేదికలు సమర్పించడంతో సోమవారం నాడు నిధులను విడుదల చేసింది. అయితే ఏపీ రాష్ట్రానికి ఇంతకాలం పాటు పెండింగ్‌లో ఉన్న నిధులు వచ్చాయని టిడిపి నేతలు సంబరాలు చేసుకొంటున్న సమయంలోనే బిజెపి నేతల రూపంలో ఇబ్బంది వచ్చి పడింది.
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.ఉపాధిహామీలో నీరు చెట్టు ద్వారా రూ.9వేల కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతుండటం ఆశ్చర్యమేస్తోందన్నారు.

ఈ మొత్తం నిధులనే పోలవరానికి ఖర్చు పెడితే సగం పనులు పూర్తయ్యేవని చెప్పుకొచ్చారు. నీరు చెట్టు పనులను పరిశీలించాలని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.
దీనిపై కేంద్రమంత్రి విచారణకు ఆదేశించారని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ నేతలతో తనను పోల్చవద్దని ఆయన టిడిపి నేతలకు సూచించారు.ఉపాధి హమీ పథకం నిదుల విషయమై కేంద్రానికి బిజెపి ఎమ్మెల్సీ ఫిర్యాదు చేయడంపై టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోము వీర్రాజుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications