కేంద్రం డబ్బులతోనే జగన్ సర్కార్ నడుస్తోంది- దందాలకే ఉత్తరాంధ్ర- జీవీఎల్ కామెంట్స్

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు కేంద్రం నుంచి తీసుకుంటున్న నిధుల విషయంలో జీవీఎల్ జగన్ సర్కార్ కు సూటి ప్రశ్నలు వేశారు. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తోందని జీవీఎల్ ఆక్షేపించారు.

విజయనగరం టూర్ కు వచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు... దశాబ్దాల పాటు ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. 2018 లో ప్రభుత్వం జరిపిన సర్వేలో విజయనగరం అత్యంత వెనుకబడిన జిల్లాగా తేలిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంతోమంది సాహితీవేత్తలు, కళాకారులు పుట్టిన గడ్డ లో అభివృద్ధి కోసం గళమెత్తడానికి ఆందోళనకారులుగా కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు.

bjp mp gvl narasimha rao says jagan government is running with central funds only

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ప్రభుత్వ నేతలను ప్రతీ ఒక్కరూ నిలదీయాలని జీవీఎల్ పిలుపునిచ్చారు. కేంద్ర పరిధిలో చేయాల్సిన అభివృద్ధి అంతా జరుగుతోందని ఆయన తెలిపారు. అన్ని రంగాల్లో నూ వెనుకంజలో ఉన్న ఈ ప్రాంతం....భూ కబ్జాల్లో మాత్రం ముందుందని వైసీపీ నేతలను ఉద్దేశించి జీవీఎల్ ఆక్షేపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కేంద్రం విధానపరమైన నిర్ణయమని, ప్రైవేటీకరణ వలన స్టీల్ ప్లాంట్ మరింత అభివృద్ధి బాటలోకి వెళ్తుందన్నారు.
ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతోందని జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వ్యవహారం ఒక్కొక్కటిగా కొలిక్కివస్తోందని జీవీఎల్ వెల్లడించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణథో పాటు రైల్వే జోన్ ఏర్పాటు విషయంలోనూ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. జీవీఎల్ నరసింహారావు విజయనగరం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలు వరుసగా ఉత్తరాంధ్రలో పర్యటనలు జరుపుతున్న క్రమంలో ఇావాళ జీవీఎల్ కూడా పర్యటించారు. కేంద్రంపై విమర్శల దాడి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్ని ఆకట్టుకునేందుకే బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+