
ఢిల్లీ సాక్షిగా ఏపీ పరువు తీస్తున్నారు; వైసీపీకి ఓటేసినందుకు జనాలు లెంపలేసుకుంటున్నారు: బీజేపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై బీజేపీ ఎంపీలు విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్ సర్కార్ పనితీరుపై ఎంపీలందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డ తీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఏపీలో వరదలకు, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయి సంభవించిన నష్టానికి జగన్ సర్కార్ వైఫల్యమే కారణం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ మంత్రులు స్పందిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక
టిప్పర్ల
కోసం..
ప్రాణాలతో
చెలగాటం;
కేంద్రమంత్రి
ప్రకటనకు
జగన్
సమాధానం
ఏంటి?
చంద్రబాబు

కేంద్ర నిధులకు స్టిక్కర్లు మార్చి పథకాలు : ఎంపీ జీవీఎల్
జగన్
పాలనలో
అభివృద్ధి
శూన్యమని,
అప్రజాస్వామిక
విధానాలతో
ప్రభుత్వ
పాలన
సాగుతోందని
బీజేపీ
ఎంపీలు
జగన్మోహన్
రెడ్డిని
టార్గెట్
చేశారు.
జగన్
సర్కార్
కేంద్ర
నిధులకు
స్టిక్కర్లు
వేసి
తమ
పథకాలుగా
ప్రచారం
చేసుకుంటోందని
ఎంపీ
జీవీఎల్
నరసింహారావు
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
కేంద్ర
నిధులను
సరిగా
సద్వినియోగం
చేయడం
లేదని,
కొన్నింటిని
దారి
మళ్లిస్తున్నారు
అని
మండిపడ్డారు.
ఇంకొన్ని
పథకాలకు
మ్యాచింగ్
గ్రాంట్లు
కూడా
ఇవ్వడం
లేదని
అసహనం
వ్యక్తం
చేశారు.
జగన్
సర్కార్
రాష్ట్రాన్ని
భారీగా
అప్పులపాలు
చేసి
సంక్షోభంలోకి
నెట్టిందని
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.

వైసీపీకి ఎందుకు ఓటేశామా అని జనాలు లెంపలేసుకుంటున్నారు : సుజనా చౌదరి
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వైసిపికి ఎందుకు ఓటు వేశామని జనాలు లెంపలు వేసుకుంటున్న పరిస్థితి తీసుకు వచ్చారని బీజేపీ ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలను అమలు అవుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అప్రజాస్వామికంగా స్థానిక సంస్థలను చేజిక్కించుకుందని విమర్శించారు. ఏ ఒక్క మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పేర్కొన్న సుజనాచౌదరి జగన్ సర్కార్ హయాంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతున్న ప్రజలకు అర్థమైంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమకు బిజెపి ఆశీస్సులు ఉన్నాయని వైసీపీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారని పేర్కొన్న సుజనాచౌదరి అదంతా అబద్ధం అంటూ పేర్కొన్నారు. వైసిపి తమకు రాజకీయ ప్రత్యర్థి అంటూ సుజనా చౌదరి స్పష్టం చేశారు.

ఏపీలో బూతు పురాణం తప్ప ప్రగతి శూన్యం : టీజీ వెంకటేష్
ఎంపీ టీజీ వెంకటేశ్ జగన్ సర్కార్ పై తీవ్రపదజాలంతో ద్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం దివాలా పరిస్థితిలో ఉందని, కేంద్రం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంగా మారిందని మండిపడ్డారు. ఏపీలో బూతుపురాణం తప్ప అభివృద్ధి పై చర్చ లేదని, పోరాటం లేదని అసహనం వ్యక్తం చేశారు టీజీ వెంకటేష్. ఆ ప్రభుత్వం చేసిన పనులను ఈ ప్రభుత్వం తాకదని, ఈ ప్రభుత్వం చేపట్టే పథకాలను ఆ పార్టీ ప్రస్తావించదని, అన్ టచబుల్ పార్టీలు ఎందుకని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరుతున్నామన్నారు టీజీ వెంకటేష్.

గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి కామెంట్లపై ఆగ్రహం : టీజీ వెంకటేష్
ఇక కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కామెంట్లపై ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యం అని, తప్పు జరిగింది మళ్లీ జరగకుండా చూస్తామని చెప్పాల్సింది పోయి, రాజకీయం చేస్తున్నారని మంత్రి కామెంట్లు చేయడం సరికాదని మండిపడ్డారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు దురుద్దేశాలు ఆపాదిస్తే కేంద్రంలో ఇబ్బందులు తప్పవని, ప్రతి నెల కేంద్ర మంత్రి వద్దకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు వెళుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎంపీ టిజి వెంకటేష్ వెల్లడించారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పే జగన్ తన తీరు మార్చుకోవాలని, లేదంటే భవిష్యత్తులో నేను మరిచాను అని కూడా చెప్పాల్సి వస్తుందని టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు.

అభివృద్ధి శూన్యంగా ఏపీ పరిస్థితి ఉంది: ఎంపీ సీఎం రమేష్
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది లేదని, అభివృద్ధి శూన్యంగా ఏపీ పరిస్థితి ఉందని ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు పునాది రాయి వేసే రెండేళ్లు గడిచిందని, ఇప్పటి వరకు అడుగు కూడా ముందుకు పడలేదు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, గంజాయి, గుట్కా వంటి దందాలు పెరిగిపోయాయని, ఎలాంటి ప్రగతి రాష్ట్రంలో కనిపించటం లేదని సీఎం రమేష్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పడితే, ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు.

ఢిల్లీ సాక్షిగా ఏపీ పరువు తీస్తున్నారు : సీఎం రమేష్
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసులు లెక్కలేనన్ని పెట్టిస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచకం తప్ప మరేమీ జరగడం లేదని పేర్కొన్న సీఎం రమేష్ పోలీసులు వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ సాక్షిగా ఏపీ పరువు తీస్తున్నారని, ఢిల్లీకి వచ్చి ప్రాజెక్టులు పథకాలు అడగటం మానేసి అప్పు ఇవ్వాలని కోరుతున్నారని మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత ముందుగా నేనే విజిట్ చేశారని పేర్కొన్న సీఎం రమేష్ ఏడాది నుండి అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు రిపేరు చేయలేదని పేర్కొన్నారు. తాను వెళ్లేంత వరకు ఎమ్మార్వో కూడా రాలేదని, కడప కలెక్టర్ కూడా పట్టించుకోలేదని ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. జగన్ సర్కార్ పై బీజేపీ ఎంపీలు అందరూ మూకుమ్మడిగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనా తీరును ఏకరువు పెట్టారు.