వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ సీట్లపైనే ప్రతిష్టంభన: పురంధేశ్వరికి ఒంగోలు

By Pratap
|
Google Oneindia TeluguNews

BJP perticular on Visakha seat
న్యూఢిల్లీ: సీమాంధ్రలో బిజెపి, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చినప్పటికీ లోకసభ స్థానాల విషయంలోనే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. సీమాంధ్రలో తమకు విశాఖపట్నం లేదా విజయవాడ, రాజమండ్రి, నరసాపురం, విజయవాడ, రాజంపేట, తిరుపతి లోక్‌సభ స్థానాలు కేటాయించాలని బిజెపి పట్టుబడుతోంది. అయితే, నరసాపురం, రాజంపేట, తిరుపతి, ఒంగోలు స్థానాలు కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ మొగ్గుచూపుతోంది.

గత ఎన్నికల్లో ఈ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి స్థానాలు వదులుకునేందుకు తెలుగుదేశం సుముఖంగా లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు స్థానాలే బీజేపీకి వెళితే పురందేశ్వరి ఒంగోలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే, ఆ స్థానాన్ని వదులుకునేందుకు టిడిపి సుముఖంగా లేకపోవటం, పొత్తులో భాగంగా వచ్చే స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతోనే హరిబాబు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

శుక్రవారంలోపు బీజేపీతో పొత్తు ఖరారు చేసుకుని, ఆ రోజున తొలి జాబితా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఒక పక్క బిజెపితో సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతూనే, తమంతట తాము జాబితా విడుదల చేయడం సరికాదని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తోంది.

English summary
It is said that Daggubati Purandheswari may contest from Ongole MP seat in Prakasam district as BJP candiadate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X