విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభ: వైసీపీ పాలనపై సమరశంఖం; పాల్గొననున్న ప్రకాష్ జవదేకర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకపక్క తెలుగుదేశం పార్టీ ఓటిఎస్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తూ, ఓటీఎస్ రద్దు చెయ్యాలని జగన్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క జగన్ సర్కారు పనితీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నంలో మంగళవారం నాడు విజయవాడలో బీజేపి ప్రజాగ్రహ సభను నిర్వహిస్తోంది.

వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ ప్రజాగ్రహ సభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడుగా ముందుకు వెళ్లాలని, జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని, ప్రజల మద్దతును కూడగట్టేలా పని చేయాలని బిజెపి అధినాయకత్వం చేసిన దిశానిర్దేశంతో రంగంలోకి దిగిన బీజేపీ నేతలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నారు.
విజయవాడలో మంగళవారం ప్రజాగ్రహ సభ నిర్వహణకు బిజెపి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభా ఏర్పాట్లను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సభలో బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజాగ్రహ సభ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ కొనసాగనుంది.
వైసీపీ పాలనను పది అంశాల ద్వారా ఎండగట్టేలా నేతల ప్రసంగాలు
ఈ సభ ద్వారా బీజేపీ ఏపీలో అధికార వైసిపి ప్రభుత్వ పాలన పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తనున్నారు. వైసీపీ పాలనను పది అంశాల ద్వారా ఎండగట్టేలా నేతల ప్రసంగాలు ఉంటాయని బిజెపి నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, తనఖా, అప్పులు, ఆర్థిక సంక్షోభం, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం, ఉద్యోగుల అవస్థలు, విద్యుత్ బిల్లుల మోత, కేంద్ర నిధుల వినియోగం, కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకోవడం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, కక్షలు కార్పణ్యాలు, ప్రభుత్వ సొమ్ముతో వైసీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరి, తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, మతమార్పిడులు అంశాలపై బిజెపి నేతలు ప్రసంగించనున్నారు.
మొత్తం 20 మంది ముఖ్యనాయకుల ప్రసంగాలు
ప్రభుత్వ పాలన తీరును ఎండగడుతూ ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామని, వైసీపీ హయాంలో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారింది అని బిజెపి నేతలు చెబుతున్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, సిఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్ తదితరులతో మొత్తం 20 మంది ఈ సభలో ప్రసంగించనున్నారు. ఏపీ సర్కార్ పాలనా వైఫల్యాలను ఎండగట్టనున్నారు.

2024 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుండే బీజేపీ వార్
2024 వ సంవత్సరంలో జరిగే ఎన్నికలలో విజయం సాధించడానికి నాంది పలికేలా, వైసీపీ సర్కార్ కు చెక్ పెట్టేలా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజేసేలా, జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచేలా బీజేపీ నిర్వహిస్తున్న ఈ ప్రజాగ్రహ సభ బిజెపికి ఏ మేరకు లాభిస్తుందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై రానున్న ఎన్నికలకు ఇప్పటి నుండే పోరాటం సాగిస్తున్నాయని తెలుస్తుంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications