111 మంది అభ్యర్థులతో బీజేపీ 5వ జాబితా: ఏపీ, తెలంగాణ నుంచి వీరే, కంగనా రనౌత్‌కు టికెట్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదవ జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ(BJP). ఈ జాబితాలో పలువురు ప్రముఖులతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను భారతీయ జనతా పార్టీ ఆదివారం నామినేట్ చేసింది.
5వ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో కంగనా రనౌత్‌తో పాటు నవీన్ జిందాల్, మేనకా గాంధీ మొదలైన ఇతర ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కాగా, బీజేపీ ఐదో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో ఆరు, బీహార్‌లో 17, సిక్కిం, మిజోరాం, గోవాలో ఒక్కో సీటు, గుజరాత్‌లో 6 సీట్లు, హర్యానాలో 4, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణలో రెండేసి సీట్లు, మహారాష్ట్రలో మూడింటికి అభ్యర్థులను పేర్కొంది. జార్ఖండ్, కేరళ, కర్ణాటకలో నాలుగు, ఒడిశాలో 21, రాజస్థాన్‌లో 7, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 19 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో..
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. తెలంగాణలోని రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్ (ఎస్సీ) స్థానానికి ఆరూరి రమేష్, ఖమ్మం ఎంపీ స్థానానికి వినోద్ రావు పేరును ఖరారు చేసింది బీజేపీ.
ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరపున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది.
ఏపీ బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే
అరకు నుంచి కొత్తపల్లి గీత
అనకాపల్లి నుంచి సీఎం రమేష్
రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి
నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస శర్మ
తిరుపతి (ఎస్సీ): వరప్రసాదరావు (వైసీపీ నుంచి ఈరోజే బీజేపీలో చేరడం గమనార్హం)
రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి.
వరుణ్ గాంధీకి దక్కని చోటు
కంగనా రనౌత్ 2024 లోక్‌సభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి పోటీ చేయనుండగా, రామాయణం ఫేమ్ అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. కాగా, పిలిభిత్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి టికెట్ ఇవ్వలేదు బీజేపీ. అయితే ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి వరుణ్ తల్లి మేనకా గాంధీని బరిలో నిలిపింది. ఐదవ జాబితాలో పిలిభిత్‌లో వరుణ్ గాంధీ స్థానంలో ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాదను బరిలో నిలపడం గమనార్హం.
BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections.
— ANI (@ANI) March 24, 2024
Nityanand Rai to contest from Ujiarpur.
Giriraj Singh from Begusarai.
Ravi Shankar Prasad from Patna Sahib.
Kangana Ranaut from Mandi.
Naveen Jindal from Kurukshetra.
Sita Soren from Dumka.
Jagadish… pic.twitter.com/xQOR2BDpA0
బీజేపీ జాబితాలోని ముఖ్య నేతలు
1. నిత్యానంద్ రాయ్ : ఉజియార్పూర్
2. గిరిరాజ్ సింగ్ : బెగుసరాయ్
3. రవిశంకర్ ప్రసాద్ : పాట్నా సాహిబ్
4. కంగనా రనౌత్ : మండి
5. నవీన్ జిందాల్ : కురుక్షేత్ర
6. సీతా సోరెన్ : దుమ్కా
7. జగదీష్ షెట్టర్ : బెల్గాం
8. కె సుధాకరన్: చిక్కబల్లాపూర్
9. ధర్మేంద్ర ప్రధాన్: సంబల్పూర్
10. ప్రతాప్ సారంగి: బాలాసోర్
11. సంబిత్ పత్ర : పూరి
12. అపరిజిత సారంగి: భువనేశ్వర్
13. అరుణ్ గోవిల్ : మీరట్
14. నవీన్ జిందాల్: కురుక్షేత్ర
15. జితిన్ ప్రసాద : పిలిభిత్
16. మేనకా గాంధీ : సుల్తాన్‌పూర్
17. రాజు బిస్తా: డార్జిలింగ్
18. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ : తమ్లుక్
19. దిలీప్ ఘోష్ : బర్ధమాన్-దుర్గాపూర్
20. అర్జున్ సింగ్ : బరాక్‌పూర్
21. అగ్నిమిత్ర పాల్: మేదినీపూర్
22. రాజీవ్ ప్రతాప్ రూడీ : శరణ్.
-
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications