తెలుగువాడిగా ఒక్కమాట అడుగుతున్నా: విజయవాడలో ఫ్లెక్సీ, బాబుకు ప్రశ్న
విజయవాడ: తెలుగువాడిగా ఒక్క మాట అడుగుతున్నానంటూ విజయవాడలో భారతీయ జనతా పార్టీ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.
చదవండి: ప్రధాని మోడీ నివాసం ఎదుట టీడీపీ ఎంపీల ధర్నా, హల్‌చల్, అరెస్ట్
తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు.. తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అంటూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అందులో పేర్కొన్నారు.
తెలుగువాడిగా ఒకే ఒక్క మాట అడుగుతున్నానని, ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ఆదాయం, అభివృద్ధి పేరుతో మీరు చేసిన అప్పులు, ఖర్చులకు సంబంధించి వివరంగా శ్వేతపత్రం విడుదల చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అని పేర్కొన్నారు.

ఈ ఫ్లెక్సీలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, స్థానిక నాయకుల ఫోటోలు ఉన్నాయి.
ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, గతంలో ప్యాకేజీకి ఒప్పుకున్నారని, దానిని ఇచ్చేందుకు కేంద్రం ఇస్తోందని, ఇలాంటప్పుడు హోదా అనడం విడ్డూరమని బీజేపీ నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే.
హోదాపై టీడీపీ మాట మార్చిందని, అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని, హోదా కోసం విద్యార్థులు, ఉద్యోగాలు కలిసి రావాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications