ఏపీ కూటమిలో గెలిచేదెవరు - ఢిల్లీ నేతలకు కీలక నివేదిక..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన భిన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో మాత్రం పోరు హోరా హోరీగా కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన తో జత కట్టిన బీజేపీ ప్రచారం, పార్టీల సహకారం పైన బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఆరా తీస్తోంది. కూటమి ఎంపీ సీట్లతో సహా ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందనే దాని పైన సమాచారం సేకరించింది. కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
సహాకారం అందుతోందా
బీజేపీ ఏపీలో 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తోంది. కూటమిగా ఏర్పడిన మూడు పార్టీల మధ్య నేతల సహకారం...ఓట్ల బదిలీ పైన బీజేపీ నాయకత్వం ఆరా తీస్తోంది. రాజమండ్రి నుంచి పరందేశ్వరి పోటీ చేస్తున్నారు. అదే విధంగా అరకు, అనకాపల్లి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట ఎంపీ సీట్లలో క్షేత్ర స్థాయి సమాచారం సేకరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. నర్సాపురంలో మూడు దశాబ్దాల కాలంగా పార్టీలో పని చేస్తున్న అభ్యర్దికి సీటు ఇచ్చారు. అక్కడ సీటు మార్పు కోసం టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా బీజేపీ అంగీకరించలేదు. అనపర్తి సీటు విషయంలోనూ టీడీపీ నుంచి ఒత్తిడి వచ్చినా బీజేపీ నేతలు మార్పుకు ఒప్పుకోలేదు. దీంతో.. నల్లిమిల్లినే బీజేపీ చేర్చుకొని సీటు ఇచ్చ ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది.

రాజమండ్రిలో పరిస్థితులు
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో సహా బీజేపీ ఎంపీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపైన పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. పార్టీకి స్థానిక సీనియర్లు, కొన్ని సంస్థలతో కలిసి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాజమండ్రి ఎంపి స్థానంలో సమీకరణలు రోజురోజుకూ మారుతున్నాయని నివేదించారు బిజెపితో పొత్తు టిడిపి కేడర్‌లో అసంతృప్తిని నింపిందని..క్షేత్ర స్థాయిలో సహకారం కనిపించటం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో రెండు ఎస్‌సి నియోజకవర్గాలు ఉన్నాయి. రాజమండ్రి అసెంబ్లీ స్థానంలో ముస్లిములతో పాటూ బిసిలు, మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. ఎంపీ సీటుతో పాటుగా అనపర్తి సీటు బీజేపీకి వెళ్లటంతో టీడీపీ కేడర్ ను నాయకత్వం బుజ్జగించినా...పోలింగ్ సమయానికి అనుకూలంగా మారుతుందా లేదా అనేది సందేహంగానే కనిపిస్తోందని చెబుతున్నారు.

ఢిల్లీ నాయకత్వానికి నివేదక
అనపర్తి సీటు నుంచి బీజేపీ అభ్యర్దిని ప్రకటించటం..ఇప్పుడు టీడీపీ అభ్యర్దిని బీజేపీలో చేర్చుకొని సీటు ఇస్తారనే సమాచారంతో రెండు పార్టీల కేడర్ లోనూ డైలమా కొనసాగుతోంది. అదే విధంగా నిడదవోలు, రాజానగరం నియోజకవర్గాలను జనసేనకు కేటాయించారు. బీజేపీ, జనసేన కోసం టీడీపీ నేతలు కొందరు ప్రచారానికి ముందుకు వచ్చినా మరో సింబల్ కు వేటేయమని చెప్పాల్సి వస్తోంది. ఇది ఓటర్లలోకి ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడు వారికి సందేహంగా మారుతోంది. వైసీపీ సామాజిక సమీకరణాలు..ప్రత్యేకంగా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. మరో అయిదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఓట్ల బదిలీ సమస్య పరిష్కారం కాకుంటే...ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని పార్టీ నాయకత్వానికి నివేదిక అందనట్లు సమాచారం. ఇప్పుడు ఢిల్లీ నేతలు ఏం చేస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications