ఏపీలో కూటమి ఎప్పటివరకూ సేఫ్ అంటే ? విష్ణుకుమార్ రాజు షాకింగ్..!
ఏపీ బీజేపీలో నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే సీనియర్ నేత, అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కూడా అయిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇవాళ మరోసారి తనదైన శైలిలో బాంబు పేల్చారు. రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎప్పటివరకూ సేఫ్ గా ఉంటాయో విష్ణుకుమార్ రాజు తేల్చిచెప్పేశారు. దీంతో విష్ణు వ్యాఖ్యలు కూటమితో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
రాష్ట్రంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ 2.0 అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విష్ణు స్పందించారు. రాష్ట్రంలో జగన్ ఉన్నంతకాలం ఇక్కడ కూటమికి ఎలాంటి ఢోకా లేదని ఆయన తేల్చిచెప్పేశారు. అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ ఉన్నంతవరకూ ఎన్డీయేకు వచ్చిన ఇబ్బందేమీ లేదని విష్ణు తెలిపారు.ఎప్పుడు ఎన్నికలు జరిగినా వీరే తమను కాపాడతారన్న అర్దం వచ్చేలా విష్ణు వ్యాఖ్యలున్నాయి.

తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మాటలు సినిమాల్లో సరిపోతాయని,, నిజ జీవితంలో ఇలాంటి మాటలు సూట్ కావని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అసభ్యంగా మాట్లాడే మంత్రులను కూటమి పార్టీల్లోకి ఎప్పుడూ తీసుకోమని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్డడించారు. రిషికొండ ప్యాలెస్‌లో ఒక హైకోర్టు బెంచ్ పెడితే మంచిదని విష్ణు తన వ్యక్తిగత అభిప్రాయంగా సలహా ఇచ్చారు. భవిష్యత్తులో కూటమికి విజయాలే వస్తాయని, వైసీపీకి ఇక ఓటములు తప్పవని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ ఊహల్లో విహరిస్తున్నారన్నారు. జగన్ మానసిక సమస్యతో బాధపడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications