
ఏపీ బీజేపీ సోషల్ మీడియాలో దూకుడు పెంచాలి ! జాతీయ నేతల కీలక సూచన..
ఏపీలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, పార్టీ బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని బీజేపీజాతీయ నేతలు మురళీధరన్, శివప్రకాష్ జీ రాష్ట్ర నేతలకు సూచించారు. రాజమహేంద్రవరంలో ఇవాళ జరిగిన సోషల్ మీడియా రాష్ట్రస్థాయి సమావేశంలో అనేక అంశాలను చర్చించారు.
ఏపీలో బీజేపీ నేతలు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలనే విషయంలో జాతీయనేతలైన మురళీధరన్, శివప్రకాష్ జీ కీలక సూచనలు చేశారు. ఇందులో అఖిల భారత సహా సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ సోషల్ మీడియాలో ఏవిధంగా పని చేయాలి అనే విషయాన్ని ఉదాహరణలతో నేతలకు వివరించారు. మండల స్థాయిలో బిజెపి సోషల్ మీడియా దూసుకువెళ్ళాలన్నారు. కనీసం రెండు మూడు భాషల్లో సోషల్ మీడియా వేదికల్లో విని యోగించాలన్నారు. జాతీయ భావాలతో ఇతరులు పెట్టే పోస్ట్ లు కూడా ఫాలో కావాలన్నారు.

కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ సోషల్ మీడియాలోని అన్ని వేదికలను వినియోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతల్నికోరారు. సోషల్ మీడియా జిల్లాల వారీగా సంఖ్య పెంచాలన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ మండలం స్థాయిలో కంటెంట్ రైటర్స్ ని పెంచుకోవాలన్నారు. సోషల్ మీడియాలో చిన్న విషయం కూడా సంచలనం సృష్టించిన సంఘటనలు ఉన్నాయిన్నారు. సోషల్ మీడియా బలోపేతం చేయడానికి సన్నద్దం కావాలన్నారు. సోషల్ మీడియా ఇంఛార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా లో ప్రతి రోజూ ట్వీట్ చేయాలని సూచించారు.డిజిటల్ మేకింగ్ పెంచుతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా విషయం సేకరణ చేయడం ద్వారా మన వేదిక లు బలోపేతం చేయడానికి వీలు కలుగుతుందన్నారు.
