పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన సిద్ధార్థనాథ్
విజయవాడ: ఏపీలోని అధికార టీడీపీతో తమ పార్టీకి ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీకి మధ్య ఎలాంటి మనన్పర్ధలు లేవని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ గత ఎన్నికల సమయంలో తమకు మద్దతు మాత్రమే తెలిపారని చెప్పారు. పవన్ స్థాపించిన జనసేన పార్టీతో తాము జతకట్టలేదని సిద్ధార్థ్ నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. టీడీపీయే తమ మిత్రపక్షమని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తమ పార్టీ ఈ నెల 26న ర్యాలీ నిర్వహించనుందని, అందులో తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటారని సిద్దార్థ నాథ్ సింగ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications