ఈ టైంలో కామెడీ అవ‌స‌ర‌మా వీర్రాజ‌న్నా? బీజేపీకి నెటిజెన్ల ప్రశ్న

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తున్నాయి. అధికార పార్టీ నేత‌లు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. వీరిద్ద‌రు అంతేస్థాయిలో విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతున్నారు. చంద్ర‌బాబు బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలు ప‌ర్య‌టిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చేందుకు ప‌వ‌న్ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు.

పొత్తుల‌పై చంద్ర‌బాబు, ప‌వ‌న్‌

పొత్తుల‌పై చంద్ర‌బాబు, ప‌వ‌న్‌


రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తుల గురించి త్యాగానికైనా సిద్ధ‌మ‌ని చంద్ర‌బాబు అంటే పొత్తులు అవ‌స‌ర‌మేనంటూ ప‌వ‌న్ మాట్లాడారు. స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు రంగ‌ప్ర‌వేశం చేశారు. చంద్ర‌బాబు త్యాగాలు గ‌తంలో చూశామ‌ని, ఇక‌ముందు చూడ‌టానికి తాము సిద్ధంగా లేమ‌న్నారు. అవినీతి పార్టీల‌తోను, కుటుంబ పార్టీల‌తోను తాము పొత్తు పెట్టుకోబోమ‌ని చెప్పుకొచ్చారు.

 జ‌న‌సేన‌ను బీజేపీ నేత‌లు గౌర‌వించాలి

జ‌న‌సేన‌ను బీజేపీ నేత‌లు గౌర‌వించాలి

థియేట‌ర్‌లో సినిమా సీరియ‌స్‌గా న‌డుస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు కాస్తంత రిలాక్సేష‌న్ ఇవ్వ‌డానికి కామెడీ పాత్ర‌లు వ‌చ్చిన‌ట్లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో సోము వీర్రాజు కామెంట్లు చేస్తున్నారంటూ కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పొత్తుల గురించి చంద్ర‌బాబు వీర్రాజుతో మాట్లాడలేద‌ని, ప‌వ‌న్ కూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా చూస్తామ‌ని చెబుతున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌య‌నింప‌చేయ‌డానికి ఇరుపార్టీల నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుంటే మ‌ధ్య‌లో సోము వీర్రాజు కామెంట్లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని, ముందుగా ఆ పార్టీ త‌మ‌తో పొత్తున్న జ‌న‌సేన‌ను, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను గౌర‌వించ‌డం నేర్చుకోవాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు హిత‌వు ప‌లుకుతున్నారు.

 పార్టీని బ‌లోపేతం చేయండి

పార్టీని బ‌లోపేతం చేయండి

ఏపీలో బీజేపీకి బ‌లం లేద‌ని, ముందుగా గ్రామ‌స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేసుకొని క‌నీసం వార్డు స‌భ్యుల‌నైనా గెలిపించుకోగ‌ల‌స్థాయికి చేరితో ఎవ‌రైనా పొత్తుల గురించి ఆ పార్టీతో మాట్లాడ‌తార‌ని, మందుగా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని, ఆ త‌ర్వాత ఇత‌ర పార్టీల పొత్తుల గురించి మాట్లాడ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సూచిస్తున్నారు. మ‌రి ఆ సూచ‌న‌లు సోము ఎంత‌వ‌ర‌కు పాటిస్తారో..??

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+