వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త‌ర‌కం ఆట మొద‌లుపెట్టిన బీజేపీ?

|
Google Oneindia TeluguNews

భార‌తీయ జ‌న‌తాపార్టీ రాజ‌కీయ క్రీడ‌లో ప్ర‌త్య‌ర్థులెవ‌రూ నెగ్గ‌లేరు. అంత క‌చ్చితంగా ఆ పార్టీ ఆడుతుంది. ఒక‌సారి బ‌రిలోకి దిగిన త‌ర్వాత ఆ పార్టీదే విజ‌యం. అందులో ఎటువంటి సందేహం అవ‌స‌రం లేదు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చింది ల‌గాయ‌తు ఈరోజు వ‌ర‌కు ఆ పార్టీ ఆట ఆప‌లేదు. అలుపు లేకుండా ఆడుతోంది. పాత చింత‌కాయ ప‌చ్చ‌డి లాంటి నియ‌మ నిబంధ‌న‌ల‌కు ఆ ఆట‌లో చోటుండ‌దు.

బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది

బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది

ఉత్త‌రాదిలో ప్రాబ‌ల్యం సంపాదించిన బీజేపీకి ద‌క్షిణాది కొర‌క‌రాని కొయ్య‌గా మారింది. ఉత్త‌ర భార‌తంలో మ‌తంపై ఎక్కువ మ‌మ‌కారం ఉంటుంది. అది ఆ పార్టీకి క‌లిసి వ‌స్తోంది. కానీ ద‌క్షిణాదిలో అభివృద్ధి కి ప్రాధాన్య‌త ఇస్తారు. దీంతో ఆ పార్టీ ఇక్క‌డ పాగా వేయ‌డానికి ఆమ‌డ‌దూరంలో వేచిచూడాల్సి వ‌స్తోంది. ఒక్క క‌ర్ణాట‌క‌లోనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పాగా వేయ‌డానికి వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

అయితే వైసీపీ.. లేదంటే టీడీపీ!

అయితే వైసీపీ.. లేదంటే టీడీపీ!


అదే స‌మ‌యంలో ఏపీపై దృష్టిసారించింది. ప్ర‌జ‌లు తెలుగుదేశం లేదంటే వైసీపీ అన్న‌ట్లుగా ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేదు.. క‌నీసం స‌ర్పంచ్‌లుగా, వార్డు స‌భ్యులుగా కూడా గెలిపించుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది. కానీ 2014 ఎన్నిక‌ల్లోకానీ, గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లోకానీ తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకొని కేంద్ర మంత్రులైన‌వారు, రాష్ట్ర మంత్రులైన‌వారు ఉన్నారు. 2019లో తెలుగుదేశం-బీజేపీ మ‌ధ్య జ‌రిగిన హోరాహోరీ పోరు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఓటమిపాలైన టీడీపీ తాజాగా బీజేపీతో స‌యోధ్య కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ అధిష్టానం దూరంగానే ఉంచుతున్న‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాలు స్ప‌ష్టం చేశాయి.

ఎంపీకి బాధ్యతల అప్పగింత?

ఎంపీకి బాధ్యతల అప్పగింత?


2024 ఎన్నిక‌ల‌న్నా ముందుగా 2023లోనే తెలంగాణ ఎన్నిక‌లు జ‌రుగుతాయి కాబ‌ట్టి ఆ రాష్ట్రాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. వాస్త‌వానికి ఏపీని 2029 ఎన్నిక‌ల‌కు ల‌క్ష్యంగా ఎంచుకుంది. కానీ ఈలోపు బ‌ల‌ప‌డాలి కాబ‌ట్టి ఒక ఎంపీకి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు ఢిల్లీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో పొత్తు లేక‌పోయినా గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంటే చాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఆ ఎంపీ ఈ బాధ్య‌త‌ను ఎంత‌వ‌ర‌కు నెర‌వేరుస్తారో, త‌న‌పై అధిష్టానం పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ముకాకుండా ఎలా కాపాడుకుంటారో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు.!!

English summary
BJP has started the game to gain foothold in AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X