వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా టు ఏపీ: పవన్ కళ్యాణ్ జారకుండా.. బాబుని దెబ్బకొట్టనున్న బీజేపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల నాటికి షాక్ ఇస్తుందా? 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో సమానంగా ఎదుగుతుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారాయి.

ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు తదితర అంశాల పైన బీజేపీ - టిడిపి నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. వాగ్యుద్ధం మాట పక్కన పెడితే.. ఏపీలో బీజేపీ సొంతగా ఎదగాలని ఉబలాటపడుతోంది. ఇందుకోసం టిడిపితో దోస్తీని వదులుకునేందుకు కూడా పావులు కదుపుతోందని అంటున్నారు.

బీజేపీ విషయానికి వస్తే ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్షంగా అడుగు పెట్టి.. స్థానిక పార్టీలకు ధీటుగా ఎదుగుతోందని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన భవిష్యత్తులో కమలం పార్టీతో చంద్రబాబుకు చిక్కులు తప్పవని అంటున్నారు. ఏ పార్టీ అయినా మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. తన పార్టీ ఎదగాలని కోరుకుంటుంది.

BJP will irks AP CM Chandrababu

ఎప్పటికీ మిత్రపక్షంలాగే ఉండాలని ఎవరూ భావించరు. ఈ నేపథ్యంలోనే ఏపీలో టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదిగేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. అవసరమైతే ఇందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సహాయం కూడా తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

టిడిపి - బీజేపీ మధ్య పొరపొచ్చలు వస్తే, ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే.. అప్పుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లోను బీజేపీ వైపు మొగ్గు చూపడం ఖాయమనే వాదనలు ఉన్నాయి. హోదా ఇవ్వకపోయినప్పటికీ అంతకుమించి సాయం చేస్తామని బీజేపీ చెప్పడం గమనార్హం.

మహారాష్ట్రలో శివసేనతో జట్టు కట్టిన బీజేపీ ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా అధికారంలోకి వచ్చింది. గతంలో మహారాష్ట్రలో శివసేనకు బీజేపీ మిత్రపక్షం. ఇప్పుడు శివసేననే బీజేపీకి మిత్రపక్షంగా మిగిలింది. మహారాష్ట్రలో బీజేపీ అధికారం చేపట్టింది.

బీహార్‌లో జేడీయుతో రెండు దశాబ్దాల పాటు కలిసి ఉంది. ఇప్పుడు జేడీయు, ఆర్జేడీలకు ధీటుగా ఎదిగింది. బీజేపీ దెబ్బకు... రెండు దశాబ్దాలుగా రాజకీయ శత్రువులు అయినా జేడీయు, ఆర్జేడీలు గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. అసోం తదితర రాష్ట్రాలలోను బీజేపీ ప్రాంతీయ పార్టీల కంటే ధీటుగా ఎదిగింది.

ఈ లెక్కన చూస్తే చంద్రబాబుకు బీజేపీ ఎప్పటికైనా రాజకీయంగా శత్రువే అని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో పెద్దగా ఓటు బ్యాంకు లేదు కాబట్టి టిడిపితో కలిసిందని, ఇప్పటికే క్రమంగా ఓటు బ్యాంకును పెంచుకుంటుందని, 2019 ఎన్నికల వరకు.. సత్తా చాటుతామని భావిస్తే తప్పకుండా చంద్రబాబుకు ఝలక్ ఇస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అవసరమైతే పవన్ కళ్యాణ్‌ను జారిపోకుండా చేసుకోగలదని అంటున్నారు.

English summary
BJP will irks AP CM Chandrababu Naidu in Andhra Pradesh in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X