• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో గ్రేటర్‌ ఫలితాల చర్చ- బీజేపీ దూకుడుపై టీడీపీ, వైసీపీల్లో టెన్షన్‌ ? బీజేపీలోనూ

|

తాజాగా ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచినా, బీజేపీ సాధించిన విజయంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎంఐఎంను మూడో స్ధానానికి నెట్టేసి మరీ బీజేపీ సాధించిన విజయం తెలంగాణలో బీజేపీ పట్టును మరింత పెంచేయగా... ఇతర రాష్ట్రాల్లోనూ, మరీ ముఖ్యంగా ఏపీలోనూ రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీసింది. గ్రేటర్‌ ఫలితాలు వెలువడుతున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష ఎమ్మెల్యేలు తమ ఛాంబర్లలో ఫలితాల గురించి ఆరా తీశారు. అదే సమయంలో బీజేపీ దూకుడు గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కనిపించింది.

గ్రేటర్‌లో బీజేపీ అనూహ్య విజయాలు..

గ్రేటర్‌లో బీజేపీ అనూహ్య విజయాలు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో తొలి నుంచీ టీఆర్‌ఎస్‌-ఎంఐఎంను టార్గెట్‌ చేసిన బీజేపీ అనుకున్న ఫలితాన్ని రాబట్టింది. 20 నుంచి 30 స్ధానాలు సాధిస్తుందన్న ఎగ్జిట్‌పోల్‌, తోటి రాజకీయ పార్టీల అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 48 స్ధానాల్లో బీజేపీ జయకేతనం ఎగరేసింది. గతంలో 150 స్ధానాలున్న జీహెచ్‌ఎంసీలో గరిష్టంగా కేవలం నాలుగు కార్పోరేటర్లు మాత్రమే గెలిచిన చరిత్ర ఉన్న బీజేపీ ఇప్పుడు 12 రెట్లు ఎక్కువ విజయాలను నమోదు చేయగలిగింది. ఇదంతా అధికార టీఆర్‌ఎస్‌-ఎంఐఎం కూటమితో సై అంటే సై అనే ధోరణి వల్లే అనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ

గ్రేటర్‌లో బీజేపీ విజయంపై ఏపీలో చర్చ...

గ్రేటర్‌లో బీజేపీ విజయంపై ఏపీలో చర్చ...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం ఏపీ పార్టీల్లో చర్చకు దారి తీసింది. అసెంబ్లీ సమావేశాల చివరిరోజు వెలువడిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష ఎమ్మెల్యేలు ఆరా తీశారు. ముఖ్యంగా బీజేపీ దూకుడుపైనే వీరంతా ఎక్కువగా చర్చించుకున్నారు. నామమాత్రంగా ఉన్న పరిస్ధితి నుంచి గ్రేటర్‌లో సై అంటే సై అనే పరిస్ధిితి వరకూ బీజేపీ రావడం వెనుక అధికార కూటమి వ్యవహరించిన తీరు, విపక్ష కాంగ్రెస్‌ బలహీనతలే కారణమన్న చర్చ ఏపీ పార్టీల్లో సాగుతోంది. అయితే బీజేపీ ఈ స్ధాయి విజయం సాధిస్తుందని తాము కూడా ఊహించలేదని వైసీపీ, టీడీపీ నేతలు చెబుతున్నారు.

బీజేపీ దూకుడుపై వైసీపీ, టీడీపీల్లో ఆందోళన

బీజేపీ దూకుడుపై వైసీపీ, టీడీపీల్లో ఆందోళన

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ రెచ్చగొట్టే అజెండాతో సాధించిన విజయాలు ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో కలవరం పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆలయాలపై దాడులు, రధాల దగ్ధాలు, ఇతర ఘటనలతో ఇరుకునపడుతున్న వైసీపీ.. ఇప్పుడు గ్రేటర్‌ తరహాలో ఇక్కడ కూడా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తే తమకు సమస్యలు తప్పవనే విషయాన్ని అంతర్గతంగా అంగీకరిస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా బీజేపీ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై మథన పడుతోంది. జనసేన తరహాలో బీజేపీతో కలిసి పోటీ చేస్తే తప్ప ఏపీలో తమ ఉనికి కాపాడుకోవడం కష్టంగా మారుతుందన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.

 జనసేన ఖుషీ- ఏపీ బీజేపీపై ఒత్తిడి..

జనసేన ఖుషీ- ఏపీ బీజేపీపై ఒత్తిడి..

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అనూహ్య విజయాలు అక్కడ ఆ పార్టీకి మద్దతిచ్చి ఎన్నికల నుంచి తప్పుకున్న జనసేనలో సంతోషం నింపాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ముందే బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్న జనసేన.. ఈ ఎన్నికల్లో బీజేపీ కోరగానే పోటీ నుంచి తప్పుకుంది. ఇప్పుడు అదే తమ కూటమికి కలిసొచ్చిందని జనసేన చెబుతోంది. తాము కూడా రంగంలో ఉంటే ఓట్లు చీలేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏపీలోనూ బీజేపీ-జనసేన కూటమి తిరుపతి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని భావిస్తోంది. త్వరలో అభ్యర్ధిని ఖరారు చేయడంతో పాటు తిరుమల వ్యవహారాలను హైలెట్‌ చేయడం ద్వారా ఉప ఎన్నికలో లబ్ది పొందాలనేది ఇరుపార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఏపీలో ఆ పార్టీపై ఒత్తిడి పెరిగింది. పొరుగు రాష్ట్రంలో వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో దీన్ని అవకాశంగా తీసుకుని ఏపీలోనూ సత్తా చాటాలని బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణతో పోలిస్తే కాస్తో కూస్తో బలమున్న జనసేన అండగా ఉండటంతో ఇదేమంత కష్టం కాదని బీజేపీ నేతలు చెప్తున్నారు.

  GHMC Results : Uttam Kumar Reddy Resigns As chief Of Telangana Congress

  English summary
  bjp's surpising win in more seats in ghmc elections creates discussion and little bit of tension in political parties in andhra pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X