ఏపీలో బీజేపీ మార్క్ రాజకీయం షురూ - చంద్రబాబు వాట్ నెక్స్ట్..!!

ఏపీలో కౌంటింగ్ పైన ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పైన ఆసక్తి పెరుగుతోంది. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల ఫలితాల పైన బీజేపీ ముఖ్య నేతలు ఆరా తీసారు. పూర్తి సమాచారం సేకరించారు. ఫలితం పైన ఒక అంచనాకు వచ్చారు. అయితే..జాతీయ స్థాయిలో ఎంపీ సీట్లు కీలకం కావటంతో బీజేపీ ఏపీలో పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది.

బీజేపీ కొత్త లెక్కలు
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన బీజేపీ దాదాపు ఒక అంచనాకు వచ్చేసింది. ఏపీలో ప్రధానంగా ఎంపీ స్థానాల పైనే ఫోకస్ చేసింది. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేసింది. మిత్రపక్షం టీడీపీ 17, జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది. రాష్ట్రంలో అధికారం కంటే మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవటంలో భాగంగానే ఏపీలో కూటమిగా పోటీ చేసింది. అందులో భాగంగా ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్క లు బీజేపీ భవిష్యత్ అడుగులకు కీలకంగా మారనుంది. కూటమికి మెజార్టీ సీట్లు దక్కితే కేంద్ర ప్రభుత్వంలో ఏపీ నుంచి మూడు పార్టీలకు భాగస్వామ్యం దక్కే అవకాశం ఉంది.

BJPs Strategic Play in AP Jagans Rajya Sabha Majority Could Be a Game-Changer

బీజేపీ మార్క్ రాజకీయం
ఇదే సమయంలో వైసీపీ దక్కించుకొనే ఎంపీ సీట్ల పైన బీజేపీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కు లోక్ సభ స్థానాలతో పాటుగా రాజ్యసభలో 11 స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చినా...బీజేపీ ప్రభుత్వానికి రాజ్యసభలో మద్దతు అవసరం. దీంతో..జగన్ తో భవిష్యత్ అవసరాలు ఉంటాయని బీజేపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. కూటమి కంటే జగన్ ఎక్కువ సీట్లు గెలిస్తే కూటమిలో టీడీపీ, జనసేన కొనసాగితే..జగన్ మద్దతు అందే అవకాశం ఉండదు. ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేసిన బీజేపీకి జగన్ నుంచి మద్దతు అందదనే అంచనాలు ఉన్నాయి.

BJPs Strategic Play in AP Jagans Rajya Sabha Majority Could Be a Game-Changer

ఎన్డీఏలో మిగిలేదెవరు
జగన్ ఎంపీ సీట్లు ఎక్కువగా గెలిస్తే...కూటమిలో టీడీపీ, జనసేన కొనసాగటం పైనా ఆసక్తి కర చర్చ సాగుతోంది. జగన్ గతంలో తరహాలోనే బయట నుంచి మద్దతు ఉంటుందనే వాదన కూడా తెర పైకి వచ్చింది. అయితే, ఢిల్లీలో ఇప్పుడు చంద్రబాబు, జగన్ ఇద్దరి వైపు బీజేపీ నేతలు చూస్తున్నట్లు స్పష్టం అవుతోంది. రాజ్యసభలో టీడీపీకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. మరో రెండేళ్ల వరకు దక్కే అవకాశం లేదనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో జగన్ తోనూ బీజేపీ పూర్తిగా దూరంగా ఉండే అవకాశం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో..ఎన్నికల్లో కూటమి -వైసీపీ గెలిచే ఎంపీ సీట్ల ఆధారంగా బీజేపీ తన మార్క్ రాజకీయ నిర్ణయాలు ఏపీలో అమలు చేసే అవకాశం కనిపిస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+