ఎన్నికల వేళ వైసీపీకి బ్లాక్ బ్లాస్టర్ న్యూస్

వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. 175కి 175 సీట్లను గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నారాయన. మరోవైపు జగన్‌ను ఓడించడానికి రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకం అయిన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు జత కట్టగా, అన్న ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా గెలుపు తమదే అని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.''మేమంతా సిద్ధం'' పేరిట సీఎం జగన్ బస్సు యాత్ర సాగిస్తున్నారు.

ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తోన్న జగన్ .. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు గురించి నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో వైసీపీ అధినేత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ వైసీపీకి బూస్ట్ ఇచ్చే న్యూస్ ఒకటి వచ్చింది. జాతీయ స్థాయిలో ఏపీ అధికార పార్టీ వైసీపీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఏపీకి రాజ్యసభలో ఉన్న 11 ఎంపీ స్థానాలనూ మొత్తం కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.

Black blaster news for YCP at the time of election

టీడీపీకి ఉన్న ఒక్క సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు పదవీ కాలం ముగిసింది. దీంతో మొట్ట మొదటిసారి రాజ్యసభలో టీడీపీ సభ్యత్వం కోల్పోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం శూన్యమైంది. వైసీపీ నుంచి కొత్తగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డిలతో రాజ్యసభ ఛైర్మన్ థన్కడ్ గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు.

ఏపీలో ఉన్న అన్ని రాజ్యసభ స్థానాలనూ దక్కించుకుని వైసీపీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దీంతో పాటు రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ జాబితాలో బీజేపీ - 97, కాంగ్రెస్ - 29, టీఎంసీ - 13 స్థానాలతో మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. 11 స్థానాలతో వైసీపీ నాలుగో స్థానంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజ్యసభలో క్లీన్‌స్వీప్ చేయడంతో వైసీపీ ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+