Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో బ్లాంక్ జీవోల రగడ : జగన్ రెడ్డి లేటెస్ట్ ఘనకార్యం వెనుక సీక్రెట్ ఇదే అన్న టీడీపీ నేత పట్టాభి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బ్లాంక్ జీవోలు దుమారం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బ్లాంక్ జీవోల పరంపర కొనసాగిస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అన్న దానికే అర్ధాన్ని మార్చేసి గోల్ మాల్ ఆర్డర్ అన్న విధంగా బ్లాంక్ జీవోలను జారీ చేస్తోందని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

 ఏపీలో కొనసాగుతున్న బ్లాంక్ జీవోల జారీ

ఏపీలో కొనసాగుతున్న బ్లాంక్ జీవోల జారీ


ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖకు సంబంధించి నిన్న 14 జీవోలను విడుదల చేసింది. ఈ జీవోలలో పది జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లో బ్లాంక్ గానే ఉంచారు. వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటుకు 85 లక్షల రూపాయల విడుదలతో పాటుగా మరో మూడు జీవోలలో సమాచారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచారు. మిగతా అన్ని జీవోలను బ్లాంక్ గా వెబ్ సైట్ లో పెట్టారు. అధికారుల బదిలీలు, పర్యటనలు, వారి ఇంటి అద్దె భత్యాల చెల్లింపు వంటి అనేక జీవోలను ఎందుకు బ్లాంక్ గా రహస్యంగా ఉంచుతున్నారో కాని పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రభుత్వ తీరుతో అధికారులు సైతం విస్తుబోతున్నారు.

జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ, జగన్ ఆర్ధిక నేరాలపై పట్టాభి ధ్వజం

జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ, జగన్ ఆర్ధిక నేరాలపై పట్టాభి ధ్వజం


ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ప్రజలకు తెలియాల్సిన సమాచారం పై ప్రభుత్వం గోప్యత పాటించడం దేనికని ప్రశ్నిస్తున్నాయి . ప్రస్తుతం బ్లాంక్ జీవోల వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మండిపడుతున్నారు. మొన్నటి వరకూ షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలతో ఆర్థిక నేరాలకు పాల్పడిన సీఎం జగన్, ఇప్పుడు తాజాగా బ్లాంక్ జీవోలతో కొత్త పంథాను అనుసరిస్తున్నారు అని నిప్పులు చెరుగుతున్నారు. ఆర్ధిక ఉగ్రవాదిగా, రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ దేశ పరువును దిగజార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా బ్లాంక్ జీవోలు ..జగన్ కొత్త పంధా

దేశంలో మరెక్కడా లేని విధంగా బ్లాంక్ జీవోలు ..జగన్ కొత్త పంధా

సహజంగా జీవోలను జారీ చేస్తే, దేనికి సంబంధించిన జీవో, వాటి రిఫరెన్స్ లేంటి, ఏ అంశానికి సంబంధించినది అన్న వివరాలు అందులో క్లియర్ గా కనబడుతుంది.కానీ జగన్మోహన్ రెడ్డి సర్కారు దేశంలో మరెక్కడా లేని విధంగా బ్లాంక్ జీవోలను జారీ చేస్తూ కొత్త పంధా మొదలు పెట్టిందని పట్టాభి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము చేసే తప్పుడు పనులుఎవరికీ తెలియకుండా ఉండటం కోసం జీవోలను రహస్యంగా జగన్ రెడ్డి ఉంచుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. గత నెల రోజుల నుండి అనేక బ్లాంక్ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొన్న ఆయన గవర్నమెంట్ ఆర్డర్ల డెఫినేషన్ మార్చేసి గోల్ మాల్ ఆర్డర్ల కింద చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిది అని ద్వజమెత్తారు.

రహస్య, బ్లాంక్ జీవోలను జారీ చెయ్యటంలో జగన్ సర్కార్ రికార్డ్ అంటూ ధ్వజం

రహస్య, బ్లాంక్ జీవోలను జారీ చెయ్యటంలో జగన్ సర్కార్ రికార్డ్ అంటూ ధ్వజం


గతంలో కూడా కాన్ఫిడెన్షియల్ జీవోలను విడుదల చేశారని మండిపడిన పట్టాభి రహస్యంగా జీవోలను దాచి పెట్టాల్సిన అవసరం ఏమిటి అంటూ ప్రశ్నించారు. దొంగ జీవోలు జారీ చేయడంలో, చీకటి జీవోలు జారీ చేయడంలో జగన్ రెడ్డి రికార్డు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 80 జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవోల పేరుతో ఒకే రోజు విడుదల చేసిన రికార్డ్ జగన్ సర్కార్ కు ఉందని ఎద్దేవా చేశారు. 10 నిమిషాల్లో 10 రహస్య జీవోలు జారీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అన్నారు. అర్థరాత్రి సమయంలో హడావుడిగా జీవోలను జారీ చేయడం దొంగ పనులు చేసే జగన్మోహన్ రెడ్డికే చెల్లుబాటు అవుతుంది అన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు 1 ఒంటిగంటకు చీకటి జీవోలు జారీ చేసిన ముఖ్యమంత్రిని జగన్ నే చూస్తున్నామన్నారు.

బ్లాంక్ జీవోలతో జగన్ రెడ్డి అవినీతి

బ్లాంక్ జీవోలతో జగన్ రెడ్డి అవినీతి

పంచాయతీరాజ్ శాఖలో కాన్ఫిడెన్షియల్ జీవోలు, పురపాలకలో అంతా గుంభనమే, గృహ నిర్మాణ శాఖలో రహస్య జీవోలు అంటూ జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన రహస్య జీవోల రికార్డుని ఏకరువు పెట్టారు. ఇక రెవిన్యూ లో అత్యధికంగా కాన్ఫిడెన్షియల్ జీవోలు జారీ చేశారని ఇది జగన్ సర్కార్ యొక్క ట్రాక్ రికార్డ్ అని పట్టాభి దుయ్యబట్టారు. ఇటీవల కాగ్ 41 వేల కోట్ల రూపాయలు చెల్లింపులకు సంబంధించి ఎవరికి చెల్లిస్తున్నారో అర్థం కాకుండా బెనిఫీషియరీ డీటెయిల్స్ లేకుండా ఎలా చెల్లించారో స్పష్టంగా పేర్కొందని వెల్లడించారు. బ్లాంక్ జీవోలతో జగన్ రెడ్డి దురుద్దేశం బయటపడుతుందని, దాని వెనక తప్పుడు పనులకు, దోపిడీకి జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పట్టాభి.

బ్లాంక్ జీవోలకు సమాధానం చెప్పాల్సింది జగన్ రెడ్డే

బ్లాంక్ జీవోలకు సమాధానం చెప్పాల్సింది జగన్ రెడ్డే

బ్లాంక్ జీవోలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని పట్టాభి ప్రశ్నించారు. సీఎం జగన్ ను నమ్ముకుంటే గతంలో ఏ విధంగా ఐఎఎస్ అధికారులు జైలుపాలయ్యారో , అదే గతి సీఎం జగన్ కు సపోర్ట్ చేసిన అధికారులకు ఆ గతి పడుతుందని, ఇలాంటి అవినీతిలో భాగస్వాములు కావొద్దు అని పట్టాభి హితవుపలికారు. బ్లాంక్ జీవోల వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఇవాళ జాతీయస్థాయిలో బ్లాంక్ జీవోలపై చర్చ జరుగుతున్నా ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

సజ్జల సైలెన్స్ దేనికో .. బ్లాంక్ జీవోలపై వివరణ ఇవ్వాలని డిమాండ్

జగన్ రెడ్డి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు వివరణ ఇవ్వడం లేదో చెప్పాలని సజ్జల పై ఫైర్ అయ్యారు. గాలి ముఖ్యమంత్రి ఖాళీ జీవోలపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు పట్టాభి. కేవలం అవినీతి కోసమే ఖాళీ జీవోలను జారీ చేస్తున్నారని, జగన్ రెడ్డి చరిత్ర అలాంటిదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక చిలికిచిలికి గాలివానగా మారుతున్న బ్లాంక్ జీవోల వ్యవహారం ముందు ముందు మరే మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+