రాజధాని ఎఫెక్ట్: మంగళగిరిలో బీఎండబ్ల్యూ షోరూం

అమరావతి: ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో తన తొలి షోరూంను ఘనంగా ప్రారంభించింది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎకరం ధర కోట్ల రూపాయలు పలుకుతున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల క్రితం తుళ్లూరు ప్రాంతంలో టెంట్లు వేసి మరీ కార్ల, బైకుల అమ్మకాలు మొదలు పెట్టారు. ఇప్పుడు మంగళగిరిలో బీఎండబ్ల్యూ వంటి సంస్థ షోరూం ప్రారంభించడం గమనార్హం. మరిన్ని కార్ల షోరూంలు ఆ ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

BMW Car Showrooms in Andhra Pradesh capital

'ఏపీకి ప్రత్యేక హోదా'

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు గురువారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల తీరు చాలా దారుణంగా ఉందన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. రాజధాని పేరును అమరావతిగా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి దానిని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+