బోటు ఎప్పుడు బయలుదేరింది, ఎంతమంది ఉన్నారు: అఖిలప్రియ ఆరా

Subscribe to Oneindia Telugu

విజయవాడ: కృష్ణా న‌దిలో బోటు ప్ర‌మాదంపై ప‌ర్యాట‌క మంత్రి భూమా అఖిల ప్రియ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. బాధితుల‌కు త‌క్ష‌ణ స‌హాయక‌ చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో స‌మీక్షించారు.

  Krishna River Boat Mishap : బోటు ప్రమాదానికి కారణాలివీ!

  చదవండి: ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లులేక.. బోటు ప్రమాదానికి కారణాలు ఇవీ

  ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద ప్రమాదంలో మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. కార్తీక వ‌న స‌మారాధ‌న‌కు వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌కు ఇలాంటి ప్ర‌మాదం ఎదుర‌వ‌డం, మృతుల్లో ఎక్కువమంది ఒంగోలు వాక‌ర్స్ క్ల‌బ్‌కు చెందిన వారు కావ‌డంపై మంత్రి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

  Boat capsize: Minister Akhila Priya monitoring

  మృతుల కుటుంబాల‌కు సంతాపాన్ని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌మాదానికి కార‌ణాల‌పై ఆరా తీశారు. బోటు భ‌వానీ ద్వీపం నుంచి ఎప్పుడు బ‌య‌లుదేరింది, ఆ స‌మ‌యంలో ప‌రిమితికి మించి ఎంత మందిని ఎక్కించుకున్నారు? అనే అంశాల‌ను ఆరా తీశారు.

  చదవండి: కృష్ణా నదిలో ఘోర ప్రమాదం, తిరగబడిన బోటు

  బోటు నిర్వాహకులైన సింపుల్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ, రివ‌ర్ బోటింగ్‌కు అస‌లు అనుమ‌తులు ఉన్నాయా? అనే అంశంపై లోతుగా ప‌రిశీల‌న జ‌ర‌పాల‌ని టూరిజం అధికారుల‌ను ఆదేశించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  At least 14 people died after a boat capsized in Krishna river in Krishna district's Vijayawada in Andhra Pradesh.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి