ఏపీ నుండి తెలంగాణలోకి..: అక్కమహాదేవి గుహలకు బోటింగ్ నో!
హైదరాబాద్: శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు, పర్యాటకులు అక్కమహాదేవి గుహలకు వెళ్లేందుకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రాంతాలకు బోటంగ్ సౌకర్యాన్ని అధికారులు నిలిపివేశారు. వేసవి సెలవులు కావడంతో... భక్తులు శ్రీశైలమల్లికార్జునస్వామి వారిని దర్సించుకొని, పాతాళ గంగ వద్ద బోటు ఎక్కి గుహలను చూసేందుకు వెళ్తారు.
భక్తులతో పాటు పర్యాటకులు కూడా సందర్శిస్తారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు వెనుక భాగంలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి. అక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతం ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ పడవలు నడుపుతోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు విడిగా అటవీ శాఖలు ఏర్పడ్డాయి.య దీంతో ఆంధ్ర ప్రాంతంలోని పాతాళ గంగ వద్ద నుండి పడవలు తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటి ప్రవేశానికి తమ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ ఏపీటీడీసీకి లేఖ రాసింది.
దీంతో నదీ విహారం సదుపాయం నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ అనుమతి కోసం రాసిన లేఖ ఆ ప్రభుత్వం వద్దే నిలిచిపోయిందని తెలుస్తోంది. తమకు వచ్చే ఆదాయంలో ఒక్కో పర్యాటకుడిపై రూ.50 చొప్పున తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఏపీటీడీసీ అంగీకరించింది. ప్రస్తుతం ఈ గుహలకు వెళ్లి వచ్చేందకు ఏపీటీడీపీసీ పెద్దలకు రూ.230, పిల్లలకు రూ.170 వసూలు చేస్తోంది.












Click it and Unblock the Notifications