జగన్ పార్టీ అనంత కార్యకర్త ఇంట్లో టైంబాంబు కలకలం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త ఇంట్లో మంగళవారం టైం బాంబు కలకలం రేపింది. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జగన్ పార్టీ కార్యకర్త వెంకట శివప్ప ఇంట్లో ఇది జరిగింది. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో మోటార్ ఆన్ చేసేందుకు బయటకు వచ్చిన వెంకట శివప్ప ఇంట్లో టైం బాంబ్ ఉన్న విషయాన్ని గుర్తించారు.
దీంతో ఆయన పోలీసులకు సమాచారమందించారు. దీంతో చిలమత్తూరు నుంచి పోలీసులు వచ్చి బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి నిర్వీర్యం చేయించారు. శివప్ప ప్రత్యర్థులే ఇలాంటి ఘాతకానికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

లారీ ఢీకొని ఇద్దరు మృతి
మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బనగానపల్లి మండలం రామాపురంలో గ్రామానికి చెందిన మంజునాథ రెడ్డి, సుబ్బారెడ్డిలు తన మిత్రులు మరో ఇద్దరితో కలిసి హైదరాబాదులో నిర్వహిస్తున్న టిడిపి మహానాడు కార్యక్రమానికి కారులో బయలుదేరారు.
ధర్మవరం సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంజునాథ రెడ్డి, సుబ్బారెడ్డిలు అక్కడికి అక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications