వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి ఎఫెక్ట్: విశాఖ బీచ్ లవ్ పెస్టివల్‌పై బాబు వెనక్కి, బొండా ఇలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: బిజెపి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరువుతుందనే ఉద్దేశంతో విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. విశాఖ లవ్ బీచ్ ఫెస్టివల్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు శుక్రవారం మీడియాతో చెప్పారు.

ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ జరుగుతుందని మీడియాలో వార్తలు రావడమే కాకుండా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా, మహిళా సంఘాల నేతలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించాయి. విషసంస్కృతిని ప్రోత్సహించే విశాఖ లవ్ బీచ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు.

నెట్లో చూశాక బికినీ అంటే తెలిసింది, ఆ పెట్టుబడులొద్దు: బాబుపై బీజేపీ మండిపాటునెట్లో చూశాక బికినీ అంటే తెలిసింది, ఆ పెట్టుబడులొద్దు: బాబుపై బీజేపీ మండిపాటు

విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివెల్ 2017 నిర్వహించాలనే ముఖ్యమంత్రి తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం నిప్పులు చెరిగారు. బికిన అంటే తాను స్కర్ట్ అనుకున్నానని, నెట్లో చూసిన తర్వాత అసలు విషయం అర్థమైందన్నారు.

Bonda Uma condemns reports on Vizag beach love festival

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రభుత్వం సన్నహాలు చేస్తుండటంపై మండిపడ్డారు. ఇలాంటి ఫెస్టివెల్స్ నిర్వహించడం సరికాదన్నారు. ఇవి మన సంప్రదాయం, సంస్కృతి కావన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసమంటూ ఇలాంటి ఫెస్ట్ నిర్వహించాలనుకోవడం విడ్డూరమన్నారు. మహిళల బికినీలు చూసి పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు మనకు అవసరం లేదన్నారు.

షకీరా స్పైసీ కనువిందు: విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ ఎలా ఉండబోతోంది?షకీరా స్పైసీ కనువిందు: విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ ఎలా ఉండబోతోంది?

బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు ముంబై సంస్థ ప్రభుత్వ పర్యాటక, మున్సిపల్ శాఖలను సంప్రదించిందనే వార్తలను బొండా ఉమామహేశ్వర రావు ఖండించారు. ఆ ఫెస్టివల్‌తో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. దాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారనడం అవాస్తవమని అన్నారు. ప్రతిపక్షాలు విషప్రచారాన్ని సాగిస్తున్నాయని ఆయన విమర్శించారు.

బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదని మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా కాకినాడలో స్పష్టం చేశారు. సంస్కృతికి భంగం కలిగించే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వదని కూడా ఆయన చెప్పారు. మున్సిపల్, పర్యాటక శాఖలను ముంబై సంస్థ సంప్రదించిందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

English summary
Telugu Desam party MLA Bonda Uma Maheswar Rao condemned reports on Visakha beach love festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X