మూడు పంటలు పండే భూములు రాజధాని పేర లాక్కున్నారు: బొత్స

హైదరాబాద్: వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రాజధాని పేరుతో లాక్కున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రైతులపై, వ్యవసాయంపై శ్రద్ధ లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబుకు వ్యవసాయాన్ని ఆదుకోవాలనే తలంపు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనోపాధి అని ఆయన అన్నారు.

Botch fires at Chandrababu for neglecting agriculture

ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. వరికి రూ.1450 కనీస మద్దతు ధర సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు.

రైతులకు బోనస్ ప్రకటించాలని, క్వింటాల్‌కు 200 రూపాయల బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+