ఏపీలో.. జూన్ 4 తరువాత

Botcha Satyanarayana: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప్రయ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘాటు విమర్శలు సంధించారు.

ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరుఫున చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీస్తే, కనీసం దానిపై సమాధానం చెప్పే స్థితిలో కూడా లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Botcha Satyanarayana made key remarks on AP Government

ఏడాది కాలంలో హామీల అమలును అటకెక్కించిన ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా టీడీపీ- జనసేన- బీజేపీ నాయకులు విమర్శల దాడి చేస్తోన్నారని విమర్శించారు. తక్షణం ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించడానికే జూన్ 4వ తేదీన వెన్నుపోటుదినం ఆందోళనను నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అనుసరిస్తోన్న విధానాలపై మీడియా ముఖంగా ప్రతిపక్షనేత వైయస్ జగన్ పలు ప్రశ్నలు సంధించారని, వాటికి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరూ సూటిగా జవాబు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని ఎద్దేవా చేశారు.

అప్పులపై కూటమి నేతలు చెప్పిన అబద్దాలు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, వైఎస్ఆర్సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై తప్పుడు కేసులు, బేతాళ కథలు మాదిరిగా సృష్టించిన మద్యం స్కామ్‌లపై జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారని గుర్తు చేశారు.

వాటిపై ఏ ఒక్క నాయకుడు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలతో మాట్లాడలేదని బొత్స పేర్కొన్నారు. దీనికి బదులుగా కూటమి పార్టీల నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలతో వ్యక్తిగత దాడికి దిగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తోందని, అయినప్పటికీ- హామీల అమలు జాడే లేదని చెప్పారు.

జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించి, వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ప్రజలతో కలిసి నిరసనలు తెలియచేయబోతున్నామని బొత్స పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం తరువాత రాష్ట్రవ్యాప్తంగా తమ ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోవడంతోనే ఈ నిరసనను చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు లేవని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి కూలీలకు వేతనాలను కూడా చెల్లించడం లేదని, ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు.

రైతులకు కూడా ఈ పాలనలో మేలు జరగ లేదని బొత్స ఆరోపించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వారే లేరని చెప్పారు. పొగాకు రైతు పరిస్థితి మరీ దారుణంగా మారిందని వ్యాఖ్యానించారు. పొగాకు, మిర్చి, ధాన్యం, టమాటా, మామిడి ఇలా ఏ పంటకూ సరైన మద్దతుధర లేక రైతుల అల్లాడిపోతున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+