నీకంత సీన్ లేదు-నా స్ధాయి తగ్గుతుంది-సిల్క్ స్మితకూ జనాలొచ్చారు-పవన్ పై బొత్స కామెంట్స్

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రుల ఎదురుదాడి కొనసాగుతోంది. తాజాగా నిన్న విజయనగరంలో పవన్ కళ్యాణ్ జగనన్న ఇళ్లపై చేసిన విమర్శలపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడి కల అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆ కల నిజం చేసింది ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని బొత్స వెల్లడించారు. తండ్రి ఆశయాలు నిజం చేస్తూ పేదలకు అండగా వుండే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు.

సుమారు ఇరవై అయిదు లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చామని, అయిదు లక్షల పేదలకు స్థలాలు ఉన్నవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నామన్నారు. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చేందుకు భూముల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

botsa satyanarayana compares pawan kalyan with silk smitha-slams remarks on ysrcp government

పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ పార్టీ కాదు, సెలబ్రిటీ పార్టీ అని బొత్స విమర్శించారు. పేద వాళ్ళకి ఇల్లు ఇస్తే తప్ప..ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పమన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది అంతా విని చూస్తూ ఊరుకోబోమన్నారు.

పవన్ పర్యటనకు వచ్చిన జనాలపై స్పందించిన బొత్స.. వ్యాంప్ కేరక్టర్ వేసే నటి, చనిపోయిన సిల్క్ స్మిత వచ్చినా జనాలు వస్తారని ఎద్దేవా చేశారు. జనాలు వచ్చినంత మాత్రం నాయకులు అవ్వరు..సినిమా వాళ్ళు వస్తే జనాలు వస్తారన్నారు.

రాష్ట్రంలో రెండవ అతిపెద్ద లేఅవుట్ విజయనగరమని బొత్స గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా పెద్ద పుడింగ్ ఆ అని బొత్స ప్రశ్నించారు. నీమీద ఢిల్లీ లో కంప్లైంట్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. నువ్వు నీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు కింద మీద పడండన్నారు. నీ గురించి మాట్లాడితే నా స్థాయి తగ్గుతుందని బొత్స తెలిపారు. నీకు అంత సీన్ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+