జగన్ పార్టీ ఊసరవెల్లి: విజయమ్మ దీక్షపై బొత్స ఫైర్

మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు పా్రటీ సానుకూలంగా మాట్లాడడంతోనే నిర్ణయం వచ్చిందని ఆయన అన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని బొత్స ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2008లో లేఖ ఇచ్చినప్పుడు కమిటీ ప్రజల అభిప్రాయాలు అడగలేదా అంటూ బొత్స ప్రశ్నించారు.
సున్నితమైన అంశాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు లబ్ది పొందాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ చూస్తోందని, అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాకే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని బొత్స స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications