సీఎం జగన్ అప్రమత్తం చేసారు, కట్టుబడి ఉంటాం - మంత్రి బొత్సా..!!

వైసీపీ ప్రారంభించిన సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. శృంగవరపుకోటలో సామాజిక సాధికార బస్సు యాత్రను వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేస్తోందని చెప్పారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర పైన సీఎం జగన్ ఆలోచనలను వెల్లడించారు. చంద్రబాబు కేసుల పైన బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు అవినీతి చేసిన కారణంగానే కేసులు నమోదయ్యాయని మంత్రి బొత్సా పేర్కొన్నారు. కోర్టుల్లోనూ అవినీతి చేసారా లేదా అనేదే విచారణ జరుగుతుందన్నారు. కోర్టు అనుమతితోనే రుషికొండ నిర్మాణాలు ఉంటాయని బొత్సా స్పష్టం చేసారు.

Botsa Satyanarayana made interesting Comments on Next Elections, And North Coastal Development

వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేస్తోందని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసాను సీఎం వైయస్‌ జగన్‌ కల్పించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆర్థిక చేయూత అందించి వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. సామాజిక సమతుల్యత పాటిస్తానని సీఎం వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్రలోనే మాటిచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. రైలు ప్రమాదం జరిగిన రెండు నిమిషాల్లోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం జగన్‌ అప్రమత్తం చేసి.. ఘటనా స్థలానికి పంపించారని చెప్పారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను, వైద్యులను ఆదేశించారన్నారు. ప్రమాద బాధితులను చూసి వాళ్లకు మానవత్వంతో పరిహారం పెంచి ఇచ్చారన్నారు. ఎస్‌.కోటకు ఎయిర్‌పోర్టు, సీ పోర్టు, రైల్వే కనెక్టివిటీ ఉందని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+