స్కూళ్ల విలీనంపై బొత్స కీలక వ్యాఖ్యలు-ప్రైవేటుకూ వ్యతిరేకం కాదు-టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్

ఏపీలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ లో ఫలితాలను విడుదల చేశారు. ఇందులో 64.23 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. మొత్తం 2,02,648 దరఖాస్తు చేయగా వీరిలో 1,91800 మంది పరీక్షలు రాశారు. బాలురులో 66,458 మంది పాసయ్యారు. అంటే ఉత్తీర్ణతా శాతం 60.83 శాతంగా నమోదైంది. అలాగే పాసైన బాలికల సంఖ్య 56,678 కాగా... ఉత్తీర్ణత శాతం 68.76 శాతంగా నమోదైంది. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఫలితాల విడుదల తర్వాత మీడియాతో మాట్లాడిన విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో విద్యాసంస్కరణలపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ప్రైవేట్ పాఠశాలలకు తాము వ్యతిరేకం కాదన్నారు.
నిబంధనలు పాటించమని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నామన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలు తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్షమన్నారు. పత్రికా కధనాలపై కూడా స్పందించి చర్యలు తీసుకుంటున్నామని బొత్స తెలిపారు.

botsa satyanarayana released 10th supplimentary results, key comments on schools merger

విద్యావిధానంలో పారదర్శకతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు విద్యామంత్రి బొత్స చెప్పుకొచ్చారు. స్కూళ్ల విలీనం జరగలేదని, కేవలం క్లాసుల విలీనం మాత్రమే జరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానం ప్రకారం విద్యా విధానం లో మార్పులు ప్రకారం విలీనం జరిగిందన్నారు. 5800 స్కూళ్ళు మ్యాపింగ్ చేసి విలీనం చెయ్యడం జరిగిందని బొత్స తెలిపారు. కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నారు.
ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రజా ప్రతినిధులు సీఎంతో సహా ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. అనవసర ప్రచారం చేసి ప్రజల్లో ఆందోళన కలిగించవద్దని బొత్స సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+