వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడే అలా చేశారు, పవన్ కళ్యాణ్‌ను నమ్మలేం: జగన్‌కు సవాల్‌పై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్‌ను నమ్మలేమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, జగన్‌లకు జనసేనాని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

చదవండి: మొన్న ఉండవల్లి కీలక వ్యాఖ్యలు: మోడీని కార్నర్ చేసే ఆధారాలు బాబుకిచ్చారా?

రైల్వే జోన్‌ కోసం ప్రజలంతా రోడ్డెక్కాల్సిన అవసరం లేదని, చంద్రబాబు, జగన్‌, మంత్రి లోకేష్‌లు విశాఖ రావాలని, మనం పట్టాలపై కూర్చుని రైళ్లను ఆపుదామని, అప్పుడు విశాఖపట్నంకు రైల్వే జోన్‌ ఎందుకు ఇవ్వరో చూద్దామని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందించారు.

చదవండి: జగన్‌కు విజ్జప్తి, చంద్రబాబు వేసిన రోడ్డుకాదు, ఇలా ఇంకెన్ని రోజులు: మురళీమోహన్ కోడలు

పవన్ కళ్యాణ్ మాటలు నమ్మలేం

పవన్ కళ్యాణ్ మాటలు నమ్మలేం

పవన్ మాటలను విశ్వసించలేమని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండుతో పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను ఢిల్లీకి వచ్చి అందరి వద్దకు తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతానని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారని, తీరా అవిశ్వాసం పెట్టిన తర్వాత కనిపించకుండా పోయారన్నారు.

18 మంది ఎంపీలతో సాధించలేదు

18 మంది ఎంపీలతో సాధించలేదు

తెలుగుదేశం పాలన పాలన 1,500 రోజులు పూర్తి అయినా ప్రజలకు ఒరిగిందేమి లేదని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. కానీ టీడీపీ నేతల అవినీతి, అక్రమాలు మాత్రం పెరిగాయని మండిపడ్డారు. 18 మంది ఎంపీలతో ఏమీ సాధించలేకపోయిన చంద్రబాబు మరో 7 ఎంపీ సీట్లు ఇస్తే హోదా సాధిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

వైయస్ బతికి ఉంటే

వైయస్ బతికి ఉంటే

వైయస్ రాజశేఖర పేరు ఎత్తడానికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం అర్హత లేదని బొత్స విమర్శించారు. వైయస్ బతికి ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ ఎప్పుడో భూస్థాపితం అయి ఉండేదన్నారు.

పవన్ పర్యటన వాయిదా, అందుకే

పవన్ పర్యటన వాయిదా, అందుకే

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నెల మూడో వారంలో ఆయన జిల్లాలో పర్యటించేందుకు జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేసింది. కానీ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటం, రైతులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండటంతో ఆయన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు జిల్లా ఇంచార్జ్ కలవకొలను తులసి ప్రకటించారు.

English summary
YSR Congress Party leader Botsa Satyanarayana said that no one is trusting Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X