బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్- హుటాహుటిన హైదరాబాద్ కు అదే ప్రధాన కారణం?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. బొత్స బ్రెయిన్ స్ట్రోక్ కు గురికావడం పార్టీలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆయన ఆరోగ్యం గురించి పార్టీ శ్రేణులు ఆరా తీస్తోన్నాయి.
ఆయన ఆరోగ్యంపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజులుగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై శాసన మండలిలో చర్చ జరగాలంటూ ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ పట్టుబడుతూ వస్తోన్నారు. దీనిపై వాయిదా తీర్మానాలను సైతం ఇచ్చారు.

నేడు కూడా దీనిపై మండలిలో రచ్చ సాగింది. వైఎస్ఆర్సీపీకి చెందిన సభ్యులందరూ కూడా మండలిలోనే బైఠాయించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, అందులో వినియోగించిన నెయ్యిని సరఫరా చేసిన ఇందాపూర్ సంస్థతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మండలిలో చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టారు.
ఈ ఆరోపణల్లో ఇటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం, అటు వైఎస్ఆర్సీపీ నాయకులు పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మండలిలో ప్రతిపక్ష పార్టీకి నాయకత్వాన్ని వహిస్తోన్న బొత్స సత్యనారాయణ వారిని ముందుండి నడిపిస్తోన్నారు. నిత్యం వాదోపవాదాలు చోటు చేసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స హైబీపీకి గురయ్యారని, ఫలితంగా బ్రెయిన్ స్ట్రోక్ సంభవించినట్లు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications