పాదయాత్రకు మరో వారం రోజులు బ్రేక్..! జగన్ వందేళ్లు బతకుతాడన్న మోహన్ బాబు..!!
హైదరాబాద్: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మరో వారం రోజులు బ్రేక్ పడనుంది. బుజం గాయం పూర్తిగా మానిపోని కారణంగా పాదయాత్ర చేస్తే గాయం తిరగదోడే అవకాశముందని డాక్టర్లు హెచ్చరించడంతో యాత్రను వాయిదా వేసుకునేందుకే జగన్ మొగ్గు చూపారు. దీంతో దీపావళి పర్వదినం తర్వాతే జగన్ పాదయాత్ర పునఃప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు లోటస్ పాండ్ లో జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. జగన్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటారని అన్నారు.
Recommended Video


డాక్టర్ల సూచనమేరకు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్..!!
జగన్ పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. రేపట్నుండి జగన్ పాదయాత్ర ప్రారంబించాలని భావించినా వైద్యుల సూచన మేరకు మరోవారం ప్రజాసంకల్పయాత్ర వాయిదవేయాలని వైసీపీ నిర్నయించింది. ఈనెల 10 నుండి పాదయాత్ర ప్రాంభం కానుంది. ఇక జగన్ ను పలువురు నేతలు పరామర్శించారు. సినీనటుడు మోహన్ బాబుతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టిశ్రేణులు ఆయనను కలిశారు.

ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న జగన్..! గాయం కారణంతో బ్రేకులు..!!
జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈనెల 10 నుండి తిరిగి ప్రారంబించాలని వైసీపీ నిర్ణయించింది.రేపట్నుండి పాదయాత్ర ప్రారంబించాలని మొదట వైసీపీ నిర్ణయించింది.జగన్ కు తగిలిన కోడి కత్తి గాయం ఇంకా మానకపోవడంతో రేట్నుండి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర వాయిదా వేసుకోవాల్సివచ్చిందని వైసీపీ వర్గాలు తెలిపాయి. జగన్ ను పరీక్షించిన వైద్యులు, గాయం మానలేదని, యాత్ర చేసే సమయంలో ఇబ్బందులు వస్తాయని హెచ్చరించడంతో మరో వారం పాటు జగన్, తన యాత్రను వాయిదా వేసుకున్నట్టు వైసీపీ శ్రేణులు తెలిపాయి.
జగన్ సంపూర్ణ ఆరోగ్యతో ఉంటాడని వ్యాఖ్య..!!

జగన్ కు నటుడు మోహన్ బాబు బాసట..! జగన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడని వ్యాఖ్య..!!
వైద్యుల సూచన మేరకు మరో వారం పాటు పాదయాత్ర వాయిదా వేయాలని వైసీపీ నిర్ణయించింది. భుజం లోపల కండరాలకు తగిలిన గాయం మానలేదని వైద్యులు స్పష్టం చేశారు. జగన్, తన ఎడమ చెయ్యిని పైకి ఎత్తే పరిస్థితి లేకపోవడంతో, మరో వారం విశ్రాంతి అనంతరం, ఈ నెల 10వ తేదీ నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. హత్యాయత్నం ఘటనలో గాయపడ్డ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ని సినీననటులు మోహన్ బాబు పరామర్శించారు.

పదో తారీఖునుండి మళ్లీ పాదయాత్ర..! జగన్ కోసం ఎదురు చూస్తున్న శ్రేణులు..!
జగన్ నివాసానికి వెళ్లిన మోహన్ బాబు ఘటన వివరాలను, తాజా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. జగన్ నిండు నూరేళ్లు బతుకుతారని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మోహన్ బాబు అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
-
పేటీఎం బ్యాచ్‌తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications