ఏపీలో వ్యవసాయ పరిజ్ఞానం భేష్-జగన్ సర్కార్ పై బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు

అమరావతి : ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పరిజ్ఞానం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు ఎంతో బావున్నాయని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాల్ని తెలుసుకునేందుకు అమరావతి వచ్చిన ఆయన.. వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఏపీలో వైసీపీ సర్కార్ అమలుచేస్తున్న వ్యవసాయ విధానాల్ని, పరిజ్ఞానాన్ని అధికారులు,మంత్రి కాకాణిని అడిగి తెలుసుకున్న బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్..ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరేలా పలు అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తాము గమనిస్తున్నామని, వాటిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకే అమరావతి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్, ఇతర అధికారులు రాష్ట్రంలో రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చే విధంగా అమలు చేస్తున్న పలు పథకాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కు వివరించారు.

britain deputy high commissioner gareth wynr owen praise andhras agri technology, model

విత్తు నుండి విక్రయం వరకూ అన్నిరకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేసే "వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల" ఏర్పాటు, వాటి పనితీరు, వాటివల్ల రైతులకు ఒనగూరే ప్రయోజనాలను బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న పలు అప్లికేషన్లపై బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆరాతీశారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ కియోస్క్ ల వల్ల రైతులకు కలిగే ఉపయోగాలు, ఇ-క్రాప్ బుకింగ్, పంటల భీమా, ఇన్ పుట్ సబ్సిడీ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానాలను అమలు పర్చడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ, ఉత్పతుల మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు.

britain deputy high commissioner gareth wynr owen praise andhras agri technology, model
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+