మొన్న అన్నా అన్నారు.. నిన్న ఆగ్రహంతో ఫైల్స్ విసిరికొట్టారు .. సీఎం జగన్ ఆగ్రహం దేనికంటే

Recommended Video

    అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్ || AP CM Jagan Shouts On IAS Officers || Oneindia

    ఏపీ సీఎం జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాలనలో తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తన దూకుడు చూపించాలని భావిస్తున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మాత్రం ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ చాలా నిర్ణయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు జగన్. ఆయన తన నిర్ణయాలతో, రాష్ట్రంలో అభివృద్ధి ని పరుగులు పెట్టించటం తో పాటుగా అధికారుల నుండి కూడా మెరుగైన పనిని ఆశిస్తున్నారు.

    అప్పుడు అన్నా అన్నారు .. ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు.. కలెక్టర్ లపై జగన్

    అప్పుడు అన్నా అన్నారు .. ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు.. కలెక్టర్ లపై జగన్

    సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లను "అన్న" అని పిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన జగన్ మోహన్ రెడ్డి, మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో చాలా అసహనంతో ఉన్నారని, కోపంతో ఫైల్స్ టేబుల్ మీద విరిసికొట్టి వెళ్లిపోయాడనే వార్తలు ఇప్పుడు అధికార వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సీఎం జగన్ అధికారుల పనితీరు మీద చాలా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అంతగా అధికారుల మీద జగన్ కోపం గా ఉండడానికి కారణం ఏంటంటే సీఎం జగన్ చెప్పిన పనిని అధికారులు చేయలేదని తెలుస్తుంది.

    నవరత్నాల అమలుకు నిధులు లేవన్న అధికారులు

    నవరత్నాల అమలుకు నిధులు లేవన్న అధికారులు

    ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ అయిన నవరత్నాల అమలు కోసం సీఎం జగన్ తెగ తాపత్రయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి నవరత్నాల అమలు సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. అధికారులు అలా చెప్పడానికి కారణం నిధులు లేకపోవటమే, నిధుల లేమితోనే నవరత్నాల అమలు చేయలేమని చెప్తే , ఎలాగైనా సాధ్యమయ్యేలా చూడమని అధికారులకు జగన్ చెప్పారు. ఇక అధికారులు సీఎం చెప్పింది ఆచరణ సాధ్యం కాదని చెప్పినట్లుగా సమాచారం.

    అధికారుల సమాధానంతో జగన్ ఆగ్రహం ... ఫైల్స్ విసిరికొట్టి మధ్యలోనే వెళ్ళిపోయిన సీఎం

    అధికారుల సమాధానంతో జగన్ ఆగ్రహం ... ఫైల్స్ విసిరికొట్టి మధ్యలోనే వెళ్ళిపోయిన సీఎం

    జగన్ అధికారంలోకి రావటానికి దోహదం చేసినవి "నవరత్నాలు". వాటిని ఎట్టి పరిస్థితుల్లో నూ అమలుచేయాలనే ఒకే ఒక లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాటికి సరిపడినంత బడ్జెట్ అనేది అందుబాటులో లేదనేది వాస్తవం. సరిపడా బడ్జెట్ లేకుంటే, ప్రత్యామ్నాయం ఆలోచించండి , అందుకు తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి అని జగన్ అధికారులకు సూచించారు. కానీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నవరత్నాల అమలు సాధ్యం కాదని చెప్పడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కోపంతో ఊగిపోయారు. ఇక ఫైల్స్ ని టేబుల్ మీద విసిరి కొట్టి మీటింగ్ హాల్ నుండి మధ్యలోనే వెళ్లిపోయారు.

    ఇక ఈ పరిణామంతో అక్కడే ఉన్న అధికారులు షాక్ అయ్యినట్లు తెలుస్తుంది. తర్వాత బయటకు వచ్చి సీఎం గారిని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదంటూ చెప్పుకుంటున్నారని సమాచారం. మొన్నటికి మొన్న అధికారులను అన్నా అని పిలిచి, ఇక నన్ను మీరు నడిపించాలని కోరిన సీఎం జగన్, ఇక తాజాగా అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేసి మరి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+