కళ్ళలో కారంకొట్టి టీడీపీ నేత దారుణ హత్య.. నారా లోకేష్ వార్నింగ్!
కర్నూలు జిల్లాలో టిడిపి మాజీ సర్పంచ్ ను హత్య చేసిన సంఘటన స్థానికంగా ప్రజలను ఒక్కసారిగా షాక్ గురి చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలో టిడిపి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. టిడిపి మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్ళినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళల్లో కారం కొట్టి అతనిని చంపేశారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య
మాజీ సర్పంచ్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ సంఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.

నిందితుల కోసం గాలింపు
అయితే తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాసులు హత్య కేసులో ఇప్పటికే ఆధారాలు సేకరించామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన స్థానిక పోలీసులు సహా గ్రామస్తులతో మాట్లాడారు. ఈరోజు సాయంత్రంలోపు నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. నిందితులను పట్టుకోవటానికి గాలింపు కొనసాగుతుందని ఆయన తెలిపారు శ్రీనివాసులు. తలపై వెనకనుంచి గొడ్డలితో నరికినట్టు గుర్తించామని, ఈ కేసులో అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నామని తెలిపారు.
టీడీపీ నేత శ్రీనివాసులు హత్యను ఖండించిన లోకేష్.. జగన్ పై ధ్వజం
ఇదిలా ఉంటే టిడిపి నేత దారుణ హత్య పై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టిడిపి మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసులు హత్యను ఖండించిన లోకేష్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం కీలకంగా పనిచేశారని, కక్షతోనే వైసీపీ నేతలు దారుణానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన జగన్ అండ్ కో పాత పంధాను మార్చుకోవడం లేదని నిప్పులు చెరిగారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో… pic.twitter.com/Wc3GxqTjR3
— Lokesh Nara (@naralokesh) August 14, 2024
సహనాన్ని పరీక్షించొద్దు.. హెచ్చరించిన లోకేష్
దాడులు చేసే వారి పైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు అంటూ ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి మూకల చేతిలో హత్యకు గురైన శ్రీనివాసుల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications