జగన్! నువ్ వేస్ట్, మూసేసుకో: బీటెక్ రవి, కడప గెలుపు క్రెడిట్ గంటాదే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే వేస్ట్ అని, ఇక ఆయన ముఖ్యమంత్రి అవుతానని చెబుతుంటారని కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి నేత బిటెక్ రవి సోమవారం ధ్వజమెత్తారు.

కడప షాక్‌కు కారణాలెన్నో: అలా ముందే జగన్ లీక్, చంద్రబాబు పైఎత్తు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేసిన వైయస్ వివేకానంద రెడ్డిని టిడిపి అభ్యర్థి బీటెక్ రవి ఓడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

'నీ సొంత జిల్లాలోనే (కడప) చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో ఈ జిల్లా వాళ్లు నాకు ఓటు వేశారు. ఇక నువ్ (జగన్) రాజకీయాలకు వేస్ట్. ఇక ముఖ్యమంత్రివి అవుతావా' అని బీటెక్ రవి అన్నారు.

సమష్టి కృషితో కడప ఎన్నికల్లో గెలిచామని చెప్పారు. వైయస్ వివేకాను, వైయస్ విజయమ్మను ఓడించడంలో మంత్రి గంటా శ్రీనివాస రావు విజయం సాధించారన్నారు. ఇక జగన్ వైసిపిని మూసుకోవాల్సిందేనని చెప్పారు. జగన్‌పై నమ్మకం లేకే తనను గెలిపించారని చెప్పారు.

సీఎం చాంబర్లో సంతోషాలు

కడప, ఎస్పీఎస్ నెల్లూరు, కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి గెలుపొందిన నేపథ్యంలో సీఎం చాంబర్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. చంద్రబాబును మంత్రులు అభినందించారు. మరోవైపు, కడపలో విజయంపై ఇంచార్జిగా వ్యవహరించిన మంత్రి గంటాను చంద్రబాబు అభినందించారు.

BTech Ravi gives kadapa win credit to Ganta and lashes out at YS Jagan

ఏపీలో చరిత్ర తిరగరాయబోతున్నామని, భవిష్యత్తు కోసం కష్టపడుదామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను నిత్య విద్యార్థిని అని, నిరంతరం నేర్చుకుంటానని చెప్పారు.

పవన్ కళ్యాణ్ ప్రకటన: టిడిపిలో ఆందోళన, జగన్‌కు మరో దారి లేదా?

సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువ కాలం ప్రజలు తనకు అవకాశమిచ్చారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి సోనియా గాంధీ హైకమాండ్ అయితే, తనకు ప్రజలు అని చెప్పారు. 2019లో మళ్లీ నేనే సీఎం అని, ఇందులో ఎలాంటి

ఇది మంచి పరిణామం: సుజన

కడప, ఎస్పీఎస్ నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో టిడిపి గెలుపు మంచి పరిణామం అని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. తమ పనితీరుకు ఈ గెలుపు నిదర్శనం అని చెప్పారు. అభివృద్ధిపై ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader BTech Ravi gave Kadapa win credit to Minister Ganta Srinivas Rao and lashes out at YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...