బీటెక్ రవి దీక్ష భగ్నం, కొనసాగుతున్న సీఎం రమేష్ నిరాహార దీక్ష
కడప: స్టీల్ ప్లాంట్ కోసం ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షను భగ్నం చేసేందుకు బుధవారం సాయంత్రం పోలీసులు దీక్షా ప్రాంగణానికి వచ్చారు. పోలీసులు అక్కడకు రావడంతో టీడీపీ కార్యకర్తలు.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
బీటెక్ రవి పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. అతనికి అత్యవసరంగా చికిత్స చేయించకుంటే అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతనిని వెంటనే రిమ్స్‌కు తరలించారు. తాను ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అతను తెలిపారు. సీఎం రమేష్ దీక్ష కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications