జగన్‌కు షాక్: బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఫ్యామిలీ రాజకీయాలకు గుడ్‌బై?

ఒంగోలు: ప్రత్యక్ష రాజకీయాలకు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి దూరంగా ఉండాలనే యోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లాలో దశాబ్దం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బూచేపల్లి కుటుంబం రాజకీయాల నుండి తప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ విషయమై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అంతర్మథనంలో ఉన్నారని ఆయన సన్నిహితుల్లో ప్రచారం సాగుతోంది.

ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానిది ప్రత్యేకత. బూచేపల్లి శివప్రసాద్ తండ్రి సుబ్బారెడ్డి, శివప్రసాద్ రెడ్డి ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు.

Recommended Video

    Poor response for YSR family programme కంచుకోటలో జగన్‌కు షాక్ | Oneindia Telugu

    ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బూచేపల్లి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకోవాలని భావించడం వెనుక అనేక కారణాలున్నాయనే ప్రచారం కూడ లేకపోలేదు.

    అయితే ప్రత్యక్ష రాజకీయాలకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దూరం కావాలనే యోచన విషయమై మల్లగుల్లాలు పడుతున్నారని ఆయన సన్నిహితుల్లో ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయమై ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటున్నారు.

    ప్రత్యక్ష రాజకీయాలకు బూచేపల్లి కుటుంబం దూరం

    ప్రత్యక్ష రాజకీయాలకు బూచేపల్లి కుటుంబం దూరం

    ప్రకాశం జిల్లాలో దశాబ్దన్నర కాలం నుంచి రాజకీయాల్లో తమదైన ముద్రతో సాగుతున్న బూచేపల్లి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆ కుటుంబానికి చెందిన డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆయన అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

    దర్శిలో ప్రత్యామ్నాయంపై జగన్ దృష్టి

    దర్శిలో ప్రత్యామ్నాయంపై జగన్ దృష్టి

    ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనే తన ఆలోచనను దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళారని ప్రచారం సాగుతోంది. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆలోచనను జగన్‌కు చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని జిల్లా నేతలకు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో బూచేపల్లి కుటుంబం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందన్న అంశం వైసీపీ నేతల్లోనే కాక యావత్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

     కుటుంబ బాధ్యతలు పెరగడమే కారణమా?

    కుటుంబ బాధ్యతలు పెరగడమే కారణమా?

    కుటుంబ బాధ్యతలు పెరగడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నట్టు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికితోడు ఎన్నికల్లో ఆర్థికపర మైన అంశాలు, పార్టీలో క్రమ శిక్షణ లోపాన్ని కూడా జగన్‌ వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం సాగుతోంది. ఒంగోలు ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలి నేని శ్రీనివాసరెడ్డితో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో ఈ విషయంపై మాట్లాడినట్లు తెలిసింది.

    బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు

    బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు

    వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ ఫ్యామిలీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. శివప్రసాద్‌రెడ్డి జగన్‌తో భేటీ అయి వచ్చిన తర్వాత ఆయన తల్లిదండ్రులు కూడా ఒక పర్యాయం వైఎస్ జగన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.

    శివప్రసాద్‌రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో దర్శి నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించ గా చివరి నిమిషంలో చుక్కెదురైంది. దీంతో స్వ తంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన త్రి ముఖ పోటీలో సుమారు 2వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆతర్వాత వైఎస్‌ సారథ్యంలో కాంగ్రెస్‌లో చేరారు. 2009లో ఆయన స్థానంలో రెండో కుమారుడైన శివప్రసాద్‌రెడ్డి అదే నియో జకవర్గం నుంచి పోటీ చేసి సుమారు 12వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో తిరిగి పోటీ చేసిన శివప్రసాద్‌రెడ్డి సుమారు 1200 ఓట్ల స్వల్ప తేడాతో శిద్దా రాఘవరావు చేతిలో ఓటమి చెందారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+