'అందుకే అమరావతిలో ప్లీనరీకి జగన్‌కు అర్హత లేదు, క్షమాపణ చెప్తేనే'
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అమరావతిలో ప్లీనరీ నిర్వహించే అర్హత లేదని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అమరావతిలో ప్లీనరీ నిర్వహించే అర్హత లేదని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురువారం మండిపడ్డారు.
ముందు జగన్ క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే ప్లీనరీ నిర్వహించుకోవాలన్నారు. అధికారం దక్కలేదని తమ ప్రభుత్వంపై వైసిపి అడుగడుగునా విషం కక్కుతోందన్నారు.

ప్రభుత్వానికి ఏ అంశంలోను ప్రతిపక్షం సహకరించడం లేదన్నారు. మీలాంటి బాధ్యతలేని ప్రతిపక్షం వల్ల రాష్ట్రానికి నష్టమన్నారు. అధికార పార్టీపై బురద జల్లేందుకే ప్లీనరీ నిర్వహిస్తున్నారన్నారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న లేఖ కూడా రాశారు.












Click it and Unblock the Notifications