కేటీఆర్ కు బుద్ధా వెంకన్న కౌంటర్-ఒక్క దెబ్బతో మీ ప్రభుత్వం.. ఎమ్మెల్సీ ఇవ్వకున్నా..!
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న రెచ్చిపోయారు. ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణకు రావడం లేదంటూ కేటీఆర్ పెట్టిన ఓ ట్వీట్ కు తీవ్రంగా స్పందించిన బుద్దా వెంకన్న.. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఎలా పొగొట్టుకుందో చెప్పేశారు. అక్కడితే ఆగకుండా జగన్ తో కేటీఆర్, కేసీఆర్ లింకుల్ని సైతం ప్రస్తావించారు.
తాజాగా తెలంగాణకు రావాల్సిన 1700 కోట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏపీ తన్నుకుపోయిందంటూ వచ్చిన ఓ వార్తా పత్రిక క్లిప్ ను జత చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ను కేటీఆర్ టార్గెట్ చేసారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించారో లేదో తెలియదు కానీ .. ఏపీలో ఉన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాత్రం ఘాటుగా స్పందించారు. కేటీఆర్ ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. దీంతో బుద్దా వెంకన్న వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

Telangana was once a magnet for investments, drawing reputed companies under the BRS government .
— KTR (@KTRBRS) March 8, 2025
Now, under Congress rule, investors seem to be choosing Gujarat, Tamil Nadu, and even Andhra Pradesh over Telangana. The question is—why? Is it the 20 - 30% commissions or RR Tax?… pic.twitter.com/sfcyCTGfpw
తెలంగాణా ప్రజలు బుద్ది చెప్పినా కేటీఆర్ కు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే వాగారని, అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే, అడ్డుకుని వెకిలిగా కేటీఆర్ మాట్లాడాడన్నారు. పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్నారు. మీ పార్టీ తుడిచిపెట్టుకు పోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడమే కారణమన్నారు.
గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే.. ప్రజలు బుద్ది చెప్పారని బుద్ధా వెంకన్న తెలిపారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా అని ప్రశ్నించారు. మీ దగ్గర గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది చంద్రబాబు అరెస్టు ను ఖండించినందుకే అనే వాస్తవం తెలుసుకో అన్నారు. ఏపీ పై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో అన్నారు.
తెలంగాణాలో బి.ఆర్.యస్ కు దిక్కు లేదని, మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారని కేటీఆర్ ను బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయి.. తెలంగాణా రాలేదు అంటూ మా రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తావా అంటూ కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు. మా ఏపీ కి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని, ప్రపంచ దేశాలు ఆయన్ను చూసి ఏపీకి వస్తాయని బుద్దా తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేస్తే.. వంద దేశాల్లో నిరసం చేశారు.. అది ఆయన స్ఠామినా అన్నారు.
ఇలాగే నోటి దూలతో ప్రభుత్వం పోయింది, ఇలాగే ఉంటే సిరిసిల్లలో కూడా మీరు గెలవరంటూ కేటీఆర్ పై బుద్దా రెచ్చిపోయారు. చంద్రబాబు పాలన గురించి జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉందన్నారు. నీలాంటోళ్లు ఏదో వాగారని.. ఆయన గొప్పతనం తగ్గదన్నారు. చంద్రబాబు గురించి.. నీకు తెలియదేమో.. మీ నాన్నకు తెలుసన్నారు. జగన్ వికృత చేష్టలతో చంద్రబాబును ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టాడన్నారు.
జగన్ జైలుకు వెళితే లక్ష కోట్లు దోచుకున్నాడు కాబట్టి వెళ్లాడు అని ప్రజలే చెప్పారని బుద్ధా తెలిపారు. చంద్రబాబు ను జైలుకు పంపితే.. అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజలు రోడ్ల మీదకు వచ్చారన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే మీకే మంచిది అన్నారు. చంద్రబాబుకు కటౌట్ చాలన్నారు. ఈ భారతదేశానికి ఏపీ గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ మాట్లాడేటప్పులు ఒళ్లు దగ్గర పెట్టుకోండని కేటీఆర్ కు సూచించారు. తీరు మార్చుకోక పోతే ప్రజలే సిరిసిల్ల నుంచి నిన్ను తరిమి కొట్టడం ఖాయమన్నారు.
మరోవైపు తనకు ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై బుద్దా వెంకన్న స్పందించారు. నాకు చంద్రబాబు దేవుడితో సమానం, అప్పుడప్పుడు దేవుళ్లు భక్తులకు పరీక్ష పెడుతుంటారన్నారు. తాను చంద్రబాబు కోసం అంకిత భావంతో పని చేస్తానని చెప్పుకొచ్చారు. అక్కడ అనేక రకాల పరిణామాలను చూసుకుని ఎమ్మెల్సీ పేర్లను ప్రకటించారని, రాజకీయాలలో పదవులు అనేవి ఒక క్రీడ.. ఒక్కోసారి గెలుస్తాం.. ఒక్కోసారి ఓడతాం అన్నారు. తనకు పదవులు ఇచ్చినా, ఇవ్వకున్నా.. చంద్రబాబు జీవితాంతం తనకు దేవుడన్నారు.
చంద్రబాబును ఎవరు ఎక్కడా దూషించినా, తాను ఇలాగే ముందుంటానన్నారు. వారికి సమాధానం చెబుతానన్నారు. తనకు ఎటువంటి నిరుత్సాహం లేదని, కొత్తగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నా దేవుడు చంద్రబాబుకు తెలుసన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు బీసీలకు, ఒక ఎస్సీకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారని,వారికి ఇవ్వడంలో న్యాయం ఉందని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టద్దని బుద్దా వెంకన్న విజ్ఞప్తి చేశారు.
ఏపీ శాసనమండలిలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రను ఎంపిక చేశారు. జనసేన నుంచి నాగబాబును, బీజేపీ నుంచి సోము వీర్రాజును ఎంపిక చేశారు. టీడీపీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉన్నా సామాజిక సమీకరణాల దృష్ట్యా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈసారి బీసీల తరఫున బీద రవిచంద్రకు అవకాశం ఇచ్చారు. కాబట్టి బుద్దా వెంకన్నకు అవకాశం దక్కలేదు.












Click it and Unblock the Notifications