ఏపీ బడ్జెట్ 2026-27 లో ఉద్యోగులకు దక్కిందేంటి..!!
AP Budget 2026-27: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. రూ 3.32 లక్షల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ ను ప్రతిపాదించింది. పలు కీలక రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. సూపర్ సిక్స్ పథకాల్లో రెండింటి అమలు దిశగా నిధులు కేటాయించింది. ఇక, గత ప్రభుత్వంలో ఆర్దిక లోపాలు.. వ్యవస్థల నిర్వహణలో వైఫల్యాల గురించి ఆర్దిక మంత్రి పయ్యావుల తన ప్రసంగంలో వివరించారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేసారు. ఈ బడ్జెట్ పైన ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో చూసారు. మరి.. ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు దక్కిందేంటి...ఆర్దిక మంత్రి ఏం చెప్పారు...
ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితిని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్దిక నిర్వహణ లో జరిగిన లోపాలను ప్రస్తావించారు. ఏపీలో గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని చెప్పుకొచ్చారు. తాము అధికారం లోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని సభ లో వివరించారు. ఈ సమస్యలతో బడ్జెట్ ప్రవేశ పెట్టటం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు. కాగా, ఈ రాష్ట్ర ఆర్దిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా.. పెండింగ్ బకాయిలు.. అదే విధంగా రావాల్సిన డీఏల పైన ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు. సంక్రాంతి వేళ ప్రభుత్వం ఒక డీఏ బకాయిలను విడుదల చేసింది. దీంతో... పీఆర్సీ ప్రకటనతో సహా ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతో ఉద్యోగులు వేచి చూసారు. జగన్ 2024 ఎన్నికల ముందు పీఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పీఆర్సీ కమిష నర్ రాజీనామా చేసారు. కొత్త పీఆర్సీ ఏర్పాటు కాలేదు.

పీఆర్సీ ప్రస్తావన లేకుండానే
ఇక.. ఈ బడ్జెట్ లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు నిరీక్షించినా ఫలితం కనిపించలేదు. బడ్జెట్ లో ఆర్దిక మంత్రి ప్రధానంగా తాము ఏ రకంగా ఆర్దిక వ్యవస్థను సరి దిద్దుతున్నామనే అంశం వివరించటానికే ప్రాధాన్యత ఇచ్చారు. డీఎస్సీ, ఇతర ఉద్యోగాల కల్పన గురించి వివరించారు. ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్ విధానం సక్రమంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిల చెల్లింపు ప్రారంభించామని వెల్లడించారు. రూ 1,100 కోట్ల బకాయిలు చెల్లించామని వివరించారు. సీపీఎస్ ఉద్యోగులకు వారి PRAN ఖాతాల్లొ ప్రభుత్వ వాటాతో కలిపి ఎప్పటికప్పుడు కంట్రిబ్యూషన్ జమ చేస్తున్నామని చెప్పారు. మహిళా ఉద్యోగులకు ఎప్పుడైనా పిల్లల సంరక్షణ సెలవులు పొందే వెసులు బాటు కల్పించామన్నారు. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే భీమా కల్పించేలా బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. అనేక కేటగిరీల్లో 30,607 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పారు. అయితే, పీఆర్సీ గురించి ప్రస్తావన చేస్తారని భావించిన ఉద్యోగులకు నిరాశ తప్పలేదు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications