బడ్జెట్ ఎఫెక్ట్: ఏపీలో రాష్ట్ర బంద్, జగన్ పాదయాత్రకు బ్రేక్, ఎంపీలకు మద్దతుగా టిడిపి ర్యాలీలు
Recommended Video

అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి అరకొర కేటాయింపులను నిరసిస్తూ వామపక్షాలు ఫిబ్రవరి రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.ఈ బంద్‌కు బిజెపియేతర పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఏపీ రాష్ట్రంలోని బిజెపి నేతల ఇళ్ళ వద్ద, ఆ పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించనున్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ ఈ బంద్‌కు మద్దతు ప్రకటించారు. మరోవైపు టిడిపి కూడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.ఈ బంద్‌ను పురస్కరించుకొని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను నిలిపివేశారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీ రాస్ట్రానికి అరకొర కేటాయింపుల విషయమై రాష్ట్రంతో పాటు రాష్ట్రం వెలుపల కూడ ఆందోళనలు కూడ సాగుతున్నాయి. ఈ తరుణంలో ఏపీకి జరిగిన అన్యాయంపై వామపక్షాలు తొలుత ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి.
అయితే ఈ బంద్‌కు వైసీపీ మద్దతు ప్రకటించడాన్ని టిడిపి తప్పుబట్టింది. ఏపీకి అన్యాయం జరుగుతున్న వైసీపీకి పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని టిడిపి వైసీపీపై నిప్పులు చెరుగుతోంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ ఏపీకి జరిగిన అన్యాయంపై స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించాలనే డిమాండ్‌తో జెఎసిని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.ఈ మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ లాంటి వారితో చర్చించనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

బిజెపి నేతల ఇళ్ళ వద్ద ఆందోళన
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరగడంపై బంద్ నేపథ్యంలో బిజెపి నేతలు, ఆ పార్టీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఏపీకి అన్యాయం జరుగుతున్న బిజెపి నేతలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

టిడిపి నిరసన ప్రదర్శనలు
ఏపీకి జరిగిన అన్యాయంపై టిడిపి ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు.ఈ నిరసన ప్రదర్శనలకు మద్దతుగా ఏపీలో ఫిబ్రవరి 8వ, తేదిన నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు టిడిపి ప్రకటించింది. మండల, జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఎంపీల నిరసనలకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.

పాదయాత్రకు జగన్ బ్రేక్
బంద్‌కు మద్దతుగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఫిబ్రవరి 8వ, తేదిన పాదయాత్రను నిలిపివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు. బంద్ సాగుతున్న సమయంలో పాదయాత్ర కొనసాగించడం కంటే నిలిపివేస్తేనే ప్రయోజనమని పార్టీ నేతలు భావిస్తున్నారు.

జనసేన మద్దతు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ ఏపీ బంద్‌కు మద్దతును ప్రకటించారు.బంద్‌ను విజయవంతం చేసేందుకు జనసేన కార్యకర్తలు పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోరారు.మరో వైపు బంద్‌ను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications