Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ఆర్ధిక శ్వేతపత్రానికి బుగ్గన స్ట్రాంగ్ కౌంటర్- సాకుపత్రమే-బడ్డెట్ పెట్టకుండా డకౌట్..!

ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై నిన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని, వైట్ పేపర్ లో సమస్యలు చెప్పి, వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెప్తారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లుందన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆశలు నీరుగార్చి చేతులెత్తేసినట్లుందన్నారు. కాబట్టి ఇది శ్వేతపత్రం కాదని, సాకుపత్రం మాత్రమేనన్నారు

సూపర్ సిక్స్ హామీల్ని నమ్మి ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వం తొలి ఓవర్లోనే డకౌట్ అయినట్లుందని బుగ్గన ఎద్దేవా చేశారు.2.50 లక్షల కోట్లు తమకు అవసరముందని చంద్రబాబు చెప్పారన్నారు. జీతాలు, పెన్షన్లు, అప్పుల చెల్లింపు, సబ్సిడీలు, పీడీఎస్ సబ్సిడీ, ఆరోగ్య శ్రీ, డైట్, కేంద్ర పథకాలకు మ్యాచింగ్ వంటివి ఇందులో ఉన్నాయని, మీకు అపారమైన అనుభవం ఉందని కదా ప్రజలు ఎన్నుకుంది, మీరే చేతులెత్తేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇందులో ప్రజా భాగస్వామ్యం కావాలని అడగటం ఏంటని నిలదీసారు.

buggana rajendranath strong counter to Chandrababu s white paper on state finances

ప్రజలు మీరెప్పుడు అమ్మఒడి ఇస్తారని, 18 ఏళ్లు దాటిన వారికి 1500 ఎప్పుడిస్తారో, రైతు భరోసా 20 వేలు ఎప్పుడిస్తారో అని ఎదురుచూస్తున్నారని బుగ్గన తెలిపారు. మీరు ఇవన్నీ పక్కనబెట్టి డకౌట్ చేసి మామూలుగా ఇవ్వాల్సిన పథకాలు కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దామంటే ఎలా అని అడిగారు. చంద్రబాబు పాలనలో దేశ స్థూల ఉత్పత్తిలో ఏపీ వాటా 4.47 శాతం, వైసీపీ ఐదేళ్ల పాలనలో 4.82. అంటే మీ కంటే ఎక్కువేగా అని ప్రశ్నించారు.

పరిశ్రమలు, తలసరి ఆదాయంలోనూ వైసీపీ పాలనే మెరుగ్గా ఉందని గుర్తుచేశారు.టీడీపీ హయాంలో నేతలు సిండికేట్ గా మారి మద్యం ధరల్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్మారు. కానీ వైసీపీ వచ్చాక ప్రభుత్వం తాము మద్యం ద్వారా తెచ్చిన ఆదాయం నాలుగు పథకాలకు ఖర్చుపెట్టిందన్నారు. మీరు మేథావులు అయితే ప్రభుత్వం మారినా ఎందుకు దాన్నే కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.

గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే రాష్ట్రం అప్పులపాలైందని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పదే పదే మాట్లాడరని, కథనాలు రాశారని కానీ ఇప్పుడు ప్రభుత్వం అప్పులు చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని బుగ్గన ప్రశ్నించారు. వైసీపీ చేస్తే అప్పు, తాము చేస్తే నెప్పా అని బుగ్గన ప్రశ్నించారు. గతంలో కాగ్, ఇతర సంస్థల నివేదికలు అడ్డుపెట్టి అప్పుల గురించి ప్రశ్నించారని, ఇప్పుడూ అవే విషయాలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఏడాదికి 21 శాతం చొప్పున అప్పులు పెరిగాయని, వైసీపీ పాలనలో 12.9 శాతం మాత్రమే పెరిగాయని బుగ్గన గుర్తుచేశారు.

తమను గెలిపిస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పారని, అమాయక పేదలు ఆశపడి ఓట్లేశారని, కానీ ఫస్ట్ ఓవర్ లోనే డకౌట్ అయ్యారని బుగ్గన విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రెవెన్యూ 90672 కోట్లని, వైసీపీ పాలన వచ్చే సరికి 1.14 లక్ష కోట్లు మాత్రమే అన్నారు. వైసీపీ పాలన ముగిసేసరికి 1.76 లక్షల కోట్లకు రెవెన్యూ పెరిగిందన్నారు. దీన్ని బట్టి సంపద ఎవరు సృష్టించారో చెప్పాలన్నారు.

గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే 2.79 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని, కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు భయపడుతోందన్నారు. అప్పులు చెప్పాల్సి వస్తుందనే బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి 4 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తుంటే బీజేపీ రాష్ఠ్ర అధ్యక్షురాలు మాత్రం 14 లక్షల కోట్లు ఉందని చెప్తున్నారని ఆరోపించారు. టీడీపీ 14 లక్షల కోట్లు అప్పులున్నాయని చెప్పి గవర్నర్ తో 10 లక్షల కోట్లని చెప్పించిందన్నారు. అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుందనే బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+