తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన 4అంతస్తుల భవనం
గుంటూరు: నగరంలో పెను ప్రమాదం తప్పింది. పాతగుంటూరులోని మణి హోటల్ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా నాలుగంతస్తుల భవనం కుప్పకూంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల తవ్వకాలు జరిపారు. దీనిలో భాగంగా పసుపులేటి నరసింహారావుకు చెందిన భవంతి ముందు భాగంలో మురికి కాలువ తవ్వకాలు చేశారు.
అయితే, ఈ తవ్వకాల్లో భవంతి పునాది బాగా దెబ్బతింది. శనివారం మధ్యాహ్నం పునాది కుంగిపోవటంతో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. భవనానికి మరమ్మతులు చేసేందుకు వచ్చిన కార్మికులు బయటికి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.












Click it and Unblock the Notifications